రాహుల్ పరిణితి .. ఆప్ తో పొత్తుకు చెల్లు


ఒకచోట కలిగే ప్రయోజనం కోసం రెండు మూడు చోట్ల తమ ప్రయోజనాల్ని ఎందుకు పణంగా పెట్టాలనే ఆలోచన రాహుల్ గాంధీకి వచ్చింది. అందుకే ఆప్ తో పొత్తు ప్రయత్నాల్లో అయన కటువైన నిర్ణయం తీసుకున్నారు. దిల్లీలో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్య పొత్తు కుదరని సంగతి తెలిసిం దే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పొత్తు అంశంపై చర్చలు విఫలమైన నేపథ్యంలో కాంగ్రెస్‌, ఆప్‌ ఒకరిపై పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. దిల్లీతో పాటు మరిన్ని రాష్ట్రాల్లోనూ పొత్తుకు ఆప్‌ పట్టు బట్టగా.. కాంగ్రెస్‌ అందుకు నిరాకరించింది. అయితే ఏ ఈవిషయంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ తో రాహుల్ వ్యవహరించిన తీరు, పొత్తు వదులుకోవడం రాజకీయంగా రాహుల్ పరిణితికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ పొత్తు కుదరకపోవడానికి ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాలే కారణమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈ చర్య ద్వారా కేజ్రీవాల్ భాజపాకు గెలుపు అవకాశాలను బలోపేతం చేశారన్నారు. ఎన్నికల ప్రచారంలో దిల్లీలోని చాంద్‌నీచౌక్‌ నియోజకవర్గ పరిధిలో సోమవారం ఒక ర్యాలీలో రాహుల్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాల ద్వారా 2014లోనూ కేజ్రీవాల్‌ భాజపా గెలుపుకి సహకజరించారని రాహుల్ మండిపడ్డారు. దిల్లీలో భాజపాను అడ్డుకోవాలంటే తమ రెండు పార్టీలు కలిసి పని చేయాలని కేజ్రీవాల్‌కు వివరించానని.. అందులో భాగంగా కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో, ఆప్‌ నాలుగు స్థానాల్లో పోటీ చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రతిపాదించిందని తెలిపారు. అందుకు తొలుత అంగీక రించిన కేజ్రీవాల్ ఆ తర్వాత హరియాణా, పంజాబ్‌లో పొత్తు అంశాన్ని తెర మీదకు తెచ్చి వివాదం రేపారన్నారు. అక్కడ పొత్తు కుదరకపోవడంతో దిల్లీ విషయంలోనూ తానూ ఇచ్చిన మాటను కేజ్రీ తప్పారని ఆరోపించారు. కాంగ్రెస్‌ మాత్రమే నరేంద్ర మోదీ, భాజపా, ఆరెస్సెస్‌ను అడ్డుకోగలదని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, కర్ణాటకలో నిరూపించామన్నారు. తమకు వివిధ అసెంబ్లీలలో బలం పెరుగుతున్న తరుణంలో ఆయాచోట్ల ఒంటరి పోరే మంచిదనే అభిప్రాయంతో కాంగ్రెస్ ఉందన్నారు.

ముఖ్యాంశాలు