హోటల్‌లో ఈవీఎంలు, కంట్రోల్‌ యూనిట్‌


బిహార్‌ ముజఫర్‌పూర్‌లోని ఓ హోటల్‌లో సోమవారం ఉదయం రెండు ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో పాటు ఒక కంట్రోల్‌ యూనిట్‌ కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న అధికారులు వాటిని స్వాధీ నం చేసుకున్నారు. అవి సాంకేతిక సమస్యలు తలెత్తిన చోట మార్చడా నికి ఏర్పాటు చేసిన అదనపు యంత్రాలని వాటికి ఇన్‌ఛార్జిగా వ్యవహరి స్తున్న ఎన్నికల అధికారి అవదేశ్‌ కుమార్‌ తెలిపారు. ఓ పోలింగ్‌ బూత్‌లో సమస్యని పరిష్కరించి వస్తుండగా.. మధ్యలో కారు డ్రైవర్‌ ఓటు వేసేందుకు వెళ్లడంతో వాటిని భద్రంగా ఉంచడం కోసం హోటల్‌కు తరలించానని ఆయన వివరించారు. ఇది నిబంధనలకు వ్యతిరేకం కావడంతో అవదేశ్‌ కుమార్‌కు ఎన్నికల సంఘం సంజాయిషీ నోటీసులు జారీ చేసింది.

ముఖ్యాంశాలు