ఉపవాసంతోనే బరువు తగ్గుతారు !


భారతీయులు పాటించే ఉపవాస నియమం ఇక్కడివారికి పెద్ద వేళాకోళంగా కనిపించే విషయం. అయితే శరీర బరువు తగ్గడానికి, కొవ్వు కరగడానికి ఇదెంత మేలో ఇప్పుడు శాస్త్రవేత్తలే చెబుతున్నారు. శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకుని బరువు తగ్గాలనుకునేవాళ్ళు తమ భోజనవేళలను మార్చుకోవడం మంచిదని అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆహారం తీసుకోవడం అనే ప్రక్రియ అమెరికాలో ఎక్కువమందికి అలవాటు. దాదాపు ఇదే మన భారతదేశంలోనూ ఉంది. అయితే ఈ వ్యవధిని ఇంకాస్త మారిస్తే మెరుగైన ఫలితాలుంటాయని పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే ఆహారం తీసుకొని.. అనంతరం మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఉపవాసం ఉంటే శరీరంలో కెలోరీలు త్వరగా కరుగుతున్నట్లు గుర్తించామని పరిశోధకులు చెప్పారు. వేగంగా బరువు తగ్గేందుకు ఈ సమయ నియమం దోహదపడుతోందన్నారు. 11 మందిపై పరిశోధనల ద్వారా ఈ విషయం గుర్తించామని తెలిపారు. .

ముఖ్యాంశాలు