ఏపీలో ఎంసెట్ పరీక్షల షెడ్యూల్


ఆంధ్రప్రదేశ్‌లో ప్రొఫెషనల్ విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంసెట్ ఇంజినీరింగ్‌ పరీక్ష ఏప్రిల్‌ 22 నుంచి 25 వరకు, ఎంసెట్‌ మెడిసిన్‌ పరీక్ష ఏప్రిల్‌ 26న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐసెట్‌ మే 2న, ఈ సెట్‌ మే 3న, పీఈ సెట్‌ మే 4న నిర్వహించనున్నారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ను కాకినాడ జేఎన్‌టీయూ, ఐసెట్‌ను ఎస్వీ యూనివర్శిటీ, ఈసెట్‌ను జేఎన్‌టీయూ అనంతపురం, పీఈ సెట్‌ను ఏఎన్‌యూ నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, ఫలితాలను వారంలోపే విడుదల చేస్తామన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం