ఇదీ మార్తాండ సూర్య దేవాలయం దుస్థితి!


బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నంతు మహేశ్వరం సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం ఇది మార్తాండ సూర్య దేవాలయం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్ కి చేరువలో ఉంది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దం లో కర్కోట రాజ వంశీయుడైన లలితాదిత్య ముక్తపాద రాజు క్రీ.పూ. 725-756 సంవత్సరాల మధ్య నిర్మించాడని ఆధారాలు ఉన్నాయి. సికిందర్ బుట్షి ఖాన్ అనే మొఘల్ పాలకుడు 15వ శతాబ్దం లో దీనిని ఇలా కూల్చి పారేశాడు. అద్భుతమైన శిల్ప నిర్మాణ వాస్తు శైలితో ఇది అత్యంత కళాత్మకంగా నిర్మితమైందని శిథిలాల్లో జరిగిన పురావస్తు పరిశోధనల్లో తేలింది. మార్తాండుని ప్రధాన ఆలయంతో పాటు 84 ఉపాలయాలు ఇందులో ఉండేవి. ఆర్కియలాజికల్ సర్వ్ ఆఫ్ ఇండియా దీనిని జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా ప్రకటించి శిథిలాలను పరిరక్షిస్తోంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం