బాబు ఓటమే బిజెపి గెలుపా?

చంద్రబాబు ఓడిపోవాలని బిజెపి కోరుకుంటోంది సరే... మరి ఎవరు గెలవాలని ఆశిస్తోంది? ఇది విలువైన ప్రశ్న. తన గెలుపు కోసం గానీ.. కనీసం తన బలాన్ని పెంచు కునేందుకు గానీ తెదేపాతో పొత్తు చెడిన తర్వాత బిజెపి ప్రయత్నించలేదు. కానీ తెదేపాతో యుద్ధం మాత్రం చేస్తోంది. ఏమిటి దీని వెనుక అజెండా? బిజెపి ఈ రాష్ట్రంలో ఎవరి అధికారాన్ని కోరుకుంటున్నది? 
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని, ప్రధానమంత్రి మోడీని విమర్శిస్తున్నాడంటే అది ఆయన రాజకీయ అవసరం. ఒక్క క్షణం ఆయన ఈ మాటల దాడి ఆపినా జనం ఆలోచించడం మొదలుపెడతారు! అది జరిగితే బాబు కి మొదటికే ముప్పు తప్పదు. అందుకే ఆయన అలా గొంతు చించుకుంటూనే ఉంటారు. పైగా ఇప్పటి తన అజెండా ప్రకారం రాహుల్ గాంధీని గెలిపించాలంటే మోడీని అపఖ్యాతి పాలు చేయాలి. ఆపనిలో ఆయన సీరియస్ గా ఉన్నారు... మరి ఇప్పుడు బిజెపి ఏం చేస్తోంది? 
చంద్రబాబే లక్ష్యంగా భావించి బీజేపీ వైపు నుంచి కూడా పెద్దఎత్తున విమర్శల దాడి జరుగుతోంది. బాబు అణువణువూ అవినీతి అని బిజెపి ఆరోపిస్తోంది... అయితే వాస్తవాలు తెలిసి.. రాజకీయాలను క్లోజ్ గా ఫాలో అయ్యేవారు ఎవరైనా ఈ విమర్శలో డొల్లతనాన్ని ఇట్టే పసిగట్టేస్తారు! బిజెపి తరఫున ఇప్పటికి చరిత్రలో ఉన్నదే ఇద్దరు ప్రధానులు. వాజపేయి,మోడీ. విచిత్రం వారిద్దరూ పదవుల్లో ఉన్నది ఇప్పటికి సుమారు పదేళ్లు కాగా ఇందులో తొమ్మిదేళ్ళు బాబు వారితో కలిసే ఉన్నారు. అప్పట్లో స్పీకర్ పదవి ఇస్తే..ఇప్పుడు రెండు పార్టీలు కేంద్ర రాష్ట్రాల్లో అధికారం కూడా పంచుకున్నాయి.  కాబట్టి బాబు అవినీతిపరుడని విమర్శించడం అంటే తాము అవినీతి ప్రభుత్వాలు నడిపామని ఘనంగా చెప్పుకోవడమే! బాబుని రాష్ట్రంలో దొంగగా చూపుతున్న బిజెపి దీనివలన తమ పార్టీకి ఏ ప్రయోజనం ఉందనేది కూడా పట్టించుకోవట్లేదు. నాదొక కన్ను పోయినా ఫర్వాలేదు... పక్కవాడికి రెండూ పోవాలని అడిగిన అపరమేధావి కథలాగే ఉందిది. వైకాపాతోలేదా జనసేనతో లేదా ఆరెంటితోనూ పొత్తు పెట్టుకునే ఆలోచన బిజెపికి ఉంటే ముందాపని చేయాలి. ఆ పని చేసి అప్పుడు బాబుని విమర్శిస్తే తమ కూటమికి మేలు జరగొచ్చు. అంతే తప్ప తాము కలుగులో దాక్కుని చంద్రబాబుని దుమ్మెత్తి పోస్తుండడం వలన బిజెపికి ఇసుమంత కూడా ప్రయోజనం ఉండదు. పోనీ బాబుని ఓడించి, వైకాపాని గెలిపించే స్థాయిలో ఏదైనా లోపాయికారీ ఒప్పందాన్ని బిజెపి వైకాపాతో లేదా జనసేనతో కుదుర్చుకుందా అంటే అదీ సాధ్యంగా కనిపించడంలేదు. అయితే యిప్పుడున్న పరిస్థితులలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు సాహసించేలా లేదు. ఎందుకంటే బిజెపిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన నెలకొందని వాటి నమ్మకం.. బిజెపి కూడా ఇలాగ భయపడుతుండవచ్చు. అందుకే నేరుగా రాష్ట్ర రాజకీయాల్లో అడుగులు వేసి పార్టీని పటిష్ట పరచుకోవడానికి బదులు ఇలా లోగుట్టు ఒప్పందాలతో కాలం గడుపుతున్నదా అనే అనుమానాన్ని కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అటు మోడీని దుయ్యబ డుతున్న బాబు కానీ.. ఇటు బాబును ఆడిపోసుకుంటున్న బిజెపి రాష్ట్ర నాయకులు గానీ ఒక కీలక విషయాన్ని విస్మరిస్తున్నారు. జనం వీరిద్దరూ చెబుతున్న మాటలని, చేస్తున్న ప్రచారాన్ని గుడ్డిగా ఏమీ నమ్మడంలేదు. వారిలోకూడా తర్కం సాగుతోంది. ఎన్నికలకి ఇంకా ఆర్నెల్లకు పైగా వ్యవధి ఉంది కాబట్టి జనం ఆలోచన కూడా తార్కికమైన ముగింపుకి చేరుతుంది. నిజంగా రాష్ట్రానికి ఎవరు కావాలో, కేంద్రంలో ఎవరు ఉండాలో చాలామందికి ఒక స్పష్టత అయితే ఏర్పడుతున్నది. జనమింత స్పష్టంగా ఉన్న దశలో రాజకీయ పార్టీలు అస్పష్ట వైఖరితో వ్యవహరించడం... తెరవెనుక అజెండాతో పని చేయడం ఇబ్బందికరమైన అంశాలు.  బిజెపిపై కోపగిస్తే కాంగ్రెస్ కి, తెలుగుదేశంపై కోపం వస్తే వైకాపాకి జనాలు ఓటేస్తారనే అంచనాతో మాత్రమే రాజకీయాలు సాగుతున్నాయి తప్ప నిజంగా జనాల మేలు కోసం కానే కాదు. అయితే బాబుకు వ్యతిరేకంగా ప్రచారం మాత్రమే చేసి బిజెపి ఇలాగే నిద్రాణంగా ఉండిపోతే ఆపార్టీ లక్ష్యం నెరవేరుతుందా? బాబు పై వ్యతిరే