చంద్రబాబుకు బిల్ గేట్స్ ప్రశంస లేఖ


వ్యవసాయంలో రాష్ట్రాన్ని ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును బిల్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని బిల్‌గేట్స్‌ ఒక లేఖలో పేర్కొన్నారు. అగ్రిటెక్‌ సదస్సు ముఖ్యమంత్రి దూరదృష్టికి అద్దం పడుతోందన్నారు. భూసార పరీక్షల మ్యాపింగ్‌తో పాటు వ్యవసాయ విధానాలను రైతులకు చేరవేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఆరోగ్యరంగంలో చేపడుతున్న సంస్కరణలు, పొరుగు సేవల విధానంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు కితాబిచ్చారు. అధికశాతం ప్రజలకు బీమా సౌకర్యం కల్పించడంలో ఆంధ్రప్రదేశ్‌ భారత్‌లోనే ముందంజలో ఉన్న విషయాన్ని తెలుసుకున్నానన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌ సూచించడం విశేషం.

ముఖ్యాంశాలు