రాహుల్ కథలు.. మతి స్థిమితంపై సందేహాలు!


రాఫెల్ డీల్ లో భారీ అవినీతి అని, అదో స్కామ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ డీల్ వివరాలు కోర్టు పరిశీలించి క్లీన్ చిట్ ఇచ్చాక కూడా .. ప్రభుత్వం స్పష్టంగా అన్నీ చెప్పాకా కూడా కాంగ్రెస్ ఇంకా పాతపాటే పాడుతూ ఉంది. అబద్ధమే అయినా సరే నిత్యం చెబుతూ పోతే ఎంతో కొంత గందరగోళం వస్తుంది.. దాని ద్వారా ఎంతో కొంత రాజకీయ లబ్ది పొందాలి అనేది కాంగ్రెస్ పార్టీ దురాలోచన. రాఫెల్ లో నీతి, అవినీతి అనే విషయం కాసేపు పక్కన పెడదాం. అసలు దీనిపై ఎవరికైనా సందేహాలు ఉంటే ఏమేం చేయాలి. పార్లమెంట్ లో, బయటా రగడ చేయడం, ఉద్యమాలు చేయడం, మీడియాలో విమర్శలు చేయడం, కోర్టుకి వెళ్లడం... ఇలావివిధ దశల్లో వ్యతిరేకతను వ్యక్తం చేయవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, మోడీ ప్రభుత్వ వైరిపక్షాలు ఈ తతంగమంతా నడిపాయి. దర్యాప్తు కోరాయి... జెపిసి వేయమని దిగాయి... చివరికి సుప్రీం కోర్టుకు కూడా వెళ్లాయి. అయితే సుప్రీంకోర్టు రాఫెల్ డీల్ లో తేడాలేమీ లేవని క్లీన్ చిట్ ఇస్తూ ప్రతిపక్షాల ఆరోపణల్ని తీసిపారేసింది. ఇదంతా జరిగినా ఇంకా రాహుల్ గాంధీకి తృప్తి లేదు. ఆయనకి రాఫెల్ ఒక్కటే నిత్యస్మరణగా మారింది. ఈ విషయంలో నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని లక్ష్యం చేసుకొని రోజుకో ఆరోపణ ఇంకా గుప్పిస్తూనే ఉన్నారు. ఇపుడు తాజాగా సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మని తిరిగి విధుల్లోకితీసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విషయాన్ని కూడా రాహుల్ వక్రీకరిస్తున్నారు. అలోక్ వర్మ, ప్రభుత్వం మధ్య వివాదం విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ఎక్కడా రాఫెల్ ప్రస్తావన లేదు. కానీ రాహుల్ గాంధీ చెప్పే కథ మాత్రం రాఫెల్ చుట్టూనే తిరుగుతోంది. రాఫెల్ డీల్ పై అలోక్ వర్మ విచారణ చేస్తున్నందుకే (లేదా చేస్తారనే భయంతోనే) ఆయనను విధులనుంచి ఆకస్మికంగా తప్పించారని రాహుల్ ఆరోపణ. ఇప్పుడు సుప్రీం కోర్టు అలోక్ వర్మని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చింది కాబట్టి రాఫెల్ పై ఆయన దర్యాప్తు చేసేస్తారని..ఇక ప్రధానమంత్రి మోడీని ఎవరూ కాపాడలేరని తాజాగా రాహుల్ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసారు.ఇక్కడే ప్రజలు వివేకంతో ఆలోచించాలి. అలోక్ వర్మ మనసులో ఏముందో..ఆయనకి, ప్రభుత్వానికి మధ్య వివాదం ఏమిటో ఎవరికి తెలుసు? అయితే అలోక్ వర్మ చెప్పాలి లేదా ప్రభుత్వం బహిర్గతం చేయాలి. మధ్యలో రాహుల్ గాంధీకి సంబంధం ఏమిటి? ఫ్రాన్స్ అధ్యక్షుడి పేరుతొ ఒకసారి, మాజీ రక్షణ మంత్రి సంభాషణల ఆడియో టేప్ అని ఇంకోసారి అసత్య కథనాలు చెప్పి రాఫెల్ విషయంలో ఇప్పటికే రాహుల్ విశ్వసనీయతను కోల్పోయారు. ఇప్పుడు ఈ ప్రకటనా అలాంటిదే. అది ఎందుకో చూద్దాం. నిజంగా దేనిపై అయినా సిబిఐ విచారణ జరగాలంటే అది ఎవరు చేయించాలి? అయితే ప్రభుత్వం చేయించాలి... లేదా పార్లమెంట్ నిర్ణయించాలి.. అదీ కాకుంటే సుప్రీం కోర్టు ఆమేరకు ఆదేశాలివ్వాలి. ఇది మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవడికైనా తెలిసే విషయం! స్వతంత్రించి సిబిఐ కేసుల విచారణలు ఎందుకు చేస్తుంది... అంత ఖాళీగా ఉందా సిబిఐ? పైగా ప్రభుత్వం పైనే ఎందుకు సొంతంగా దర్యాప్తు చేస్తుంది.. అదీ నేరుగా డైరెక్టర్ ఆ పని చేస్తాడా? సుప్రీం కోర్టు స్వయంగా చెప్పింది రాఫెల్ డీల్ లో స్కామ్ ఏమీలేదని.. ఇక ప్రభుత్వం అయితే పార్లమెంటులో కూడా కాంగ్రెస్ ఆరోపణల్ని నిర్ద్వంద్వముగా తిప్పికొట్టింది. జెపిసి వేయాలన్న డిమాండ్ ని కూడా కేంద్రం తోసిపారేసింది. మరి రాహుల్ గాంధీ మాటలేంటి.. దానికి మీడియా ప్రచారమేంటి!! మతి స్థిమితం లేనివాడు ఏదేదో మాట్లాడినా కూడా వార్తలవుతాయా? రాహుల్ గాంధీ కాబట్టి, సోనియా కొడుకు కాబట్టి ఏది చెప్పిన, ఎంత అసంబద్ధం అయినా ప్రచురణ, ప్రసార అర్హమే అవుతుందా? సిబిఐ డైరెక్టర్ అయినంత మాత్రాన అలోక్ వర్మ అనే అధికారి ప్రభుత్వ ఆదేశం, ప్రమేయం లేకుండా రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తు చేస్తాడా? మోడీని దోషిగా తేల్పించేసి శిక్ష వేయించేస్తాడా!! ఈ మాటలే చెబుతున్నాడు రాహుల్ గాంధీ. మరి అలోక్ వర్మ ఎక్కడైనా (కోర్టులో అయినా సరే) ఈవిషయం తెలిపాడా? మీడియా ముందేమైనా చెప్పాడా ? మరి ఏ ప్రమాణంతో, ఏ ఆధారంతో మాట్లాడుతున్నాడు రాహుల్ ఇవన్నీ? అయితే ఈ మాటల్ని బట్టి కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం కావాలి మనకి! అయితే రాహుల్ గాంధీ నిఖార్సయిన పిచ్చాడైనా అయి ఉండాలి.. లేదా అలోక్ వర్మ అనే సిబిఐ ఉన్నతాధికారిని ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పుచేతల్లో పెట్టుకొని సిబిఐ ద్వారా ఏదో తప్పుడు పని చేసే కుట్రకి పాల్పడి ఉండాలి. ఈ రెండూ కూడా నిజాలే అయ్యే ఛాన్స్ ని మనం కాదనలేం. ఎందుకంటే రాహుల్ గాంధీ మానసిక పరిస్థితి పై దేశ ప్రజలకి సుస్పష్టమైన అవగాహన అనేక అంశాల్లో ఇప్పటికే ఉంది. ఇక దేశ భద్రతపై అక్కర గాని, నైతిక విలువలు గానీ ఏమాత్రం లేని నాయకులు, వారి అనుంగు అనుచరులతో వర్ధిలుతున్న కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుంది. దీనిని బట్టి అత్యంత అనూహ్యంగా, అసాధారణంగా అలోక్ వర్మపై ప్రభుత్వం వేటు వేయడంలో బయటికి తెలియని రహస్య కోణం ఏదో ఉందని కూడా అనిపిస్తుంది. కాంగ్రెస్ సిబిఐ లోని అత్యున్నత వ్యక్తులతో కలిసి ఏదైనా కుట్ర అమలుకు ప్రయత్నించిందా? ఆ విషయం బయటపడడంతోనే కేంద్రప్రభుత్వం అప్పటికప్పుడు అనూహ్య చర్యలు తీసుకుందా? ఇటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుని ప్రకటనల నేపథ్యంలో తలెత్తుతు న్నాయి. ఒక్కోసారి ప్రభుత్వం కొన్ని చర్యలు ఎందుకు తీసుకుందో బయటికి చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు.. కానీ చర్య తీసుకోవడం వలన తనకు కావాల్సిన ఫలితం మాత్రం పొందవచ్చు. ఇక్కడకూడా అలాంటిదే ఏదైనా జరిగిందా అనే అభిప్రాయం కూడా కలుగుతోంది. సుప్రీం కోర్టు సిబిఐ డైరెక్టర్ పై చర్య విషయంలో ప్రభుత్వాన్ని తప్పు పట్టిందనేది నిజం. ఇది పాలకులకి ఇబ్బంది కలిగించే అంశమే. ఇదొక్కటీ చాలు నిజానికి మోడీని ఇరుకున పెట్టడానికి. ఎందుకు చర్య తీసుకున్నారో ప్రభుత్వం సరిగా చెప్పుకోలేకపోయింది కాబట్టే కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చింది. దానినే కాంగ్రెస్ ప్రచారంచేసి ఎంతో కొంత లభ్ది పొందవచ్చు. కానీ రాఫెల్ కి ఈ తీర్పుని ముడి పెట్టడం ద్వారా కాంగ్రెస్ మరోసారి తన లేకి తనాన్ని, దుగ్ధని బయటపెట్టుకుంది.

ముఖ్యాంశాలు