సాత్విక భక్తితోనే సత్య దర్శనం

(సమన్వయ సరస్వతి, ప్రవచన విరించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో ఏడవ రోజు ప్రసంగం) 
సాత్విక భక్తి ద్వారా మాత్రమే పరమాత్మను చేరుకోవడం సాధ్యపడుతుందని ప్రవచన విరించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. సాక్షాత్ భగవదవతారుడు కపిల మహర్షి ప్రతిపాదించిన సాంఖ్య సిద్ధాంతాన్ని శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో భాగంగా ఏడవరోజైన గురువారం ఆయన సుజన మనోహరంగా విశ్లేషించారు. అటుపైన అష్టాంగ యోగములను విశదపరిచారు. త్రివిధ భక్తి విశేషాలను హృదయానికి హత్తుకునేలా వివరించారు. భక్తి మూడు విధాలుగా ఉంటుందని చెబుతూ అవి తామస, రాజస, సాత్విక భక్తులు అని పేర్కొన్నారు. హింసా కామనతో ఉండేది తామస భక్తి అని.. ఇది పతన హేతువని చెప్పారు. భస్మాసురుడు, మహిషుడు ఇత్యాది రాక్షసుల భక్తి ఈ కోవలోకి వస్తుందన్నారు. ఈ భక్తి వలన తత్కాల ప్రయోజనాలను పొందగగలిగినా అచిరకాలంలోనే అవి బెడిసి కొట్టి పతనం అవుతాడని తెలిపారు. రెండవదైన రాజస భక్తి ఇంద్రియాలను తృప్తి పరచే భోగాల కోసం, ఐశ్వర్యం, కీర్తిని ఆశించి ఉంటుందన్నారు. అయితే కోరికలను ఆశ్రయించుకుని ఉండే రాజస భక్తి వలన సాధకుడు ఎప్పటికీ సంతృప్తిని, పరమ గమ్యమైన మోక్షద్వారాన్ని చేరలేడన్నారు. స్వయంగా కోరికే దుఃఖ హేతువు అనే విషయాన్ని గుర్తెరిగిన వారు ఈ దశను దాటి ముందుకు వెళతారని చెప్పారు.ప్రస్తుత సమాజంలో ఎక్కువమంది కోరికలే పరమావధిగా దైవారాధనను ఆశ్రయించడం ఒకింత బాధాకరమన్నారు. శాశ్వతమైన ఆనందాన్ని విస్మరించి క్షణిక సుఖాల కోసం వెంపర్లాడకుండా ఈ రాజస భక్తి నుంచి సాత్వికభక్తి వైపు ఎదగాలన్నదే భాగవతం ఇచ్చే సందేశమన్నారు. మూడవది, ఉత్తమమైనది అయిన సాత్విక భక్తిలో సాధకుడు ఇది తన విధి అనే భావనతో.. పరమేశ్వరుడు ప్రీతి చెందాలనే ఉద్దేశంతో మాత్రమే సత్కర్మలు ఆచరిస్తాడన్నారు. తద్వారా చిత్త మాలిన్యాలను తొలగించుకొని శుద్ధుడై సగుణ ఆరాధన నుంచి నిర్గుణ ఉపాసన స్థాయికి చేరుకుంటాడని ప్రతిపాదించారు. సాత్విక భక్తి నుంచి నిర్గుణోపాసన స్థాయికి చేరిన వారు మాత్రమే ముక్తి పొందగలుగుతారన్నారు. ప్రపంచ చైతన్యాన్ని పరమేశ్వరునిగా గుర్తించి, ఆ భగవద్ రూపమే తన స్వస్వరూపమని గ్రహించిన వారు ఆత్మారాములై తరిస్తారన్నారు. ప్రపంచం అంతా పరమేశ్వర స్వరూపమే అని తెలుసుకున్న సాత్విక భక్తులు, నిర్గుణోపాసకులు ప్రతి వ్యక్తిలో, జీవిలో, చరాచర వస్తువులలో ఆ ఈశ్వరుడిని దర్శిస్తారన్నారు. ఇట్టివారు ఎట్టి భేద భావనకు తావు లేని జీవితంతో సమ సమాజ భావనను ఆచరణలో చూపుతారన్నారు. సమ సమాజం, సామరస్యం వంటి భావాలన