ఎపి కి నిధులపై కుదిరిన అంగీకారం ?


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీకి కేంద్ర ప్ర‌భుత్వం సానుకూల సంకేతాలు ఇచ్చిందని సమాచారం. 2014-15 సంవత్సరానికి గాను 14వ ఆర్థికసంఘం నిబంధన ల ప్రకారం 10 నెలల కాలానికి రాష్ట్రానికి రావాల్సిన మొత్తం వెంటనే ఇవ్వాలని భావిస్తు న్నట్టు తెలుస్తోంది. అలాగే ఇంకొంత పెద్ద మొత్తాన్ని కూడా ఒకేసారి విడుదల చేసేందు కు అంగీకరించినట్లు సమాచారం. ఏపీ అంశాలపై పరిష్కారానికి కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో సుజనా చౌదరి సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం సాగింది. ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, విశాఖ రైల్వేజోన్‌, కొన్ని ఇతర సంస్థల ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చిం చారు. అమ‌రావ‌తి నిర్మాణానికి చేసిన ఖ‌ర్చుల వివ‌రాల‌ను సమర్పిస్తే నిధులు ఇస్తామ‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌కారం ఈఏపీ నిధుల స‌ర్దుబాటుకు సిద్ధంగా ఉన్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు పేర్కొన్నాయి. విశాఖ రైల్వేజోన్‌ ను ప్రకటించాలని కూడా కేంద్రం భావిస్తున్నట్టు తెలిసింది. దుగరాజపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం చూపించిన ప్రదేశంలో నిర్మించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తంచేసింది. దీనికి నిధులు విడుదల చేయడంతో పాటు అన్ని అనుమతులు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

ముఖ్యాంశాలు