సమంతపై రంగస్థలం టీజర్

రామ్‌చరణ్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్లో సమంతను చూపించలేదు. చిట్టిబాబు పాత్రలో నటిస్తున్న చరణ్‌ను మాత్రమే పరిచయం చేశారు. కాగా శుక్రవారం సమంత పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేకమైన టీజర్‌ను విడుదల చేశారు. ఉపాసన, నితిన్, దేవిశ్రీ ప్రసాద్, హంసా నందిని, బీవీఎస్ రవి తదితరులు ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. ఈ టీజర్ ని ఆరు గంటల్లోనే యూట్యూబ్‌లో 13 లక్షల మందికిపైగా చూశారు. ఈ స్పందనకు సమంత ఆనందం వ్యక్తం చేశారు. ట్వీట్లు చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. హీరోయిన్ కోసం ప్రత్యేకమైన టీజర్‌ను విడుదల చేయడం విశేషమన్నారు. సుకుమార్‌తో కలిసి చరణ్ ఈ పని చేయించాడని సీబీబుతూ థాంక్స్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ ‘రంగస్థలం’ సినిమాను నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మార్చి 30న ఈ సినిమా విడుదల కానుంది.