సమస్యపై సమరం చేసిన మహర్షి

May 9, 2019

దిల్‌ రాజు, సి. అశ్వినీదత్‌, ప్రసాద్‌ వి. పొట్లూరి కలిసి నిర్మించిన భారీ చిత్రం మహర్షి. 
మహేశ్‌బాబు, అల్లరి నరేష్‌, జగపతిబాబు, పూజ హెగ్డే, ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, రావు రమేశ్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ప్రధాన తారాగణం. సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: కె.యు. మోహనన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌, కథ: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌, దర్శక త్వం: వంశీ పైడిపల్లి
క‌మ‌ర్షియ‌ల్ పరిధిలోనే రొటీన్ కి భిన్నమైన వివిధ కథలు ఈ మధ్య తెరకెక్కుతున్నాయి. సామా జిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకునే సాహ‌సం తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతోంది. మ‌హేష్ బాబు ఈ కోవలోనే ‘శ్రీ‌మంతుడు’, ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమాల్ని చేశాడు. అవి క‌మర్షియ‌ల్ గ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు మళ్ళీ అదే దారిలో ‘మ‌హర్షి’గా ముందుకువచ్చాడు. ఇది మహేష్ 25 వ చిత్రం కావడం మరో విశేషం. హీరోయిజానికి  ఎక్క‌డా లోటు లేకుండానే కథకి ఓ సామాజిక సమస్యని నేపథ్యంగా ఎంచుకున్నాడు. ఊపిరి చిత్రం ఫేమ్ వంశీ పైడిప‌ల్లి ఈ చిత్ర దర్శకుడు.
రిషి కుమార్ (మ‌హేష్ బాబు) ఓ కంపెనీకి సీఈఓ. ఓటమి తెలియని బిజినెస్ టైకూన్. త‌న క‌ష్టాన్నీ, క‌ల‌ల్ని, విజ‌య సోపానాలుగా మ‌ల‌చుకున్న వ్య‌క్తి. మ‌ధ్య‌త‌ర‌గ‌తి స్థాయి నుంచి అంచె లంచెలుగా ఎదుగుతాడు. త‌న జీవితం, త‌న విజ‌యాలు త‌నొక్క‌డి కష్ట ఫలాలు కావని, ఇద్దరు స్నేహితుల (పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్‌) క‌ష్టం, త్యాగం ఉన్నాయ‌ని గ్ర‌హిస్తాడు. వారి కోసం రిషి ఏం చేశాడు? విజ‌యం అంటే డ‌బ్బు సాధించ‌డ‌మే, స్థాయిని పెంచుకోవ‌డ‌మే అనుకునే రిషి - అస‌లైన విజ‌యాన్ని ఎలా గుర్తించి, సాధించి, మ‌హ‌ర్షిగా మారాడు? అనేదే ఈ క‌థ‌.
సీఈఓగా రిషిని ప‌రిచ‌యం చేసే స‌న్నివేశాలు చాలా స్టైలిష్‌. వెంట‌నే ఫ్లాష్ బ్యాక్ బ్యాంగ్. సీఈఓగా, విద్యార్థిగా వేరియేష‌న్స్ చూపించాడు మ‌హేష్‌. కాలేజీ స‌న్నివేశాలు స‌ర‌దాగా సాగిపోతాయి. స్నేహం, ప్రేమ‌ పండిస్తూనే విద్యా వ్య‌వ‌స్థ తీరు తెన్నుల‌ను ఎమోషనల్ గా  ప్ర‌శ్నించే ప్ర‌య‌త్నం చేశాడు. కాలేజీ నేప‌థ్యం, ముగ్గురు వ్యక్తుల మ‌ధ్య స్నేహం, విద్యావ్య‌వ‌స్థ‌పై వ్యంగ్య బాణాలు  ‘త్రీ ఇడియ‌ట్స్’‌` ని గుర్తు తెస్తాయి. 
తొలి స‌గంలో విద్యావ్య‌వ‌స్థ‌ని ప్ర‌శ్నించిన హీరో పాత్ర ద్వితీయార్ధంలో రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తుంది. దేశానికి వెన్నెముక అని చెప్పుకునే రైతుల దీన‌స్థితిని క‌ళ్ల‌కు క‌ట్టారు. రిషి ల‌క్ష్యం, ఆశ‌య సాధ‌న‌కు ఎంచుకున్న మార్గం ఆలోచింపజేస్తాయి. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఇలాంటి పాయింట్ చెప్పడం సాహసమే. ద్వితీయార్ధం మొత్తం ఇదే కాన్సెప్ట్ అవ్వడం వలన సాగదీతగా కూడా కనిపిస్తుంది. ఇంచుమించుగా మూడు గంట‌ల నిడివి ఈ సినిమాకి కాస్త ఇబ్బందే.  స‌న్నివేశాల్ని ఎడిట్ చేసే ప్రయత్నంచేయలేదనిపిస్తుంది. మ‌హేష్ - న‌రేష్ ఎపిసోడ్‌లో ఎమోషన్స్‌ పెద్దగా పండవు. మలుపులు పెద్దగా లేని కథ, క్లైమాక్స్ కూడా రొటీన్‌. అయితే ఒక మంచి క‌థ‌ని నిజాయ‌తీగా చెప్పే ప్ర‌య‌త్నం అభినందనీయం.
న‌టుడిగా మ‌హేష్‌కి త‌న పాత్ర‌లో మూడు షేడ్స్ కి న్యాయం చేసాడు. తెర‌పై అందంగా క‌నిపించాడు. అభిమ