దర్శనమిస్తున్న కేదార్‌నాథుడు

కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలను ఈ ఉదయం నుంచి తెరిచారు. ఆరు నెలల మూసివేత తర్వాత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ప్రధాన ద్వారాలను తెరిచారు. కేదారేశ్వరుని దర్శనానికి వివిధ రాష్ట్రాలనుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఆరోజే గంగోత్రి, యమునోత్రి ద్వారాలు తెరచుకోగా.. ఇవాళ కేదారనాథ్ ఆలయాన్ని తెరిచారు. రేపు శుక్రవారం  బద్రీనాథ్‌ ఆలయ ప్రధాన ద్వారాలు తెరచుకోనున్నాయి.

Facebook
Twitter