చరిత్రలో అత్యంత విఫల ప్రధాని మోదీ


ప్రధాని మోదీ పాలనపై ట్విటర్‌లో చంద్రబాబు విమర్శలు

మోడీ అంత విఫల ప్రధానిని ఈ దేశం చూడలేదు.

మోదీ పాలనలో దేశంలో ఎప్పుడూ లేనంతగా అంత:కలహాలు రేగాయి.

స్వరాజ్యం వచ్చాకా ఈ 70 ఏళ్లలో దేశం చూసిన ప్రధాన మంత్రుల్లో అస్సలు జవాబుదారీతనం లేని ప్రధాని మోదీయే.

ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టని ప్రధాని మోదీ తప్ప మరెవరూ లేరు.

దేశంలో మొదటిసారి నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బయటికొచ్చి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మీడియాతో చెప్పారు.

చరిత్రలో తొలిసారిగా సాక్షాత్తూ రక్షణశాఖ కార్యాలయంలోనే దేశ భద్రతకు సంబంధించిన పత్రాలు (రఫేల్‌) మాయం అయ్యాయి. ఇలా ఎప్పుడైనా జరిగిందా?

బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మోడీ దెబ్బతీశారు.

ఏటీఎంలను దిష్టిబొమ్మలుగా మార్చేశారు.

నోట్లరద్దును పెద్ద కుంభకోణంగా మార్చారు.. జీఎస్టీ అమలులో ఘోరంగా విఫలమయ్యారు. మోదీ పాలనలో రూపాయి విలువ దారుణంగా పతనం అయింది.

ముఖ్యాంశాలు