మోదీ ఎందుకు నచ్చలేదంటే....

మోదీని  వ్యతిరేకిస్తున్న చాలామందితో అలాగే తటస్థులని అనుకున్నవారితో ఇరా న్యూస్ పేపర్.కామ్ తరఫున మిత్రులు, కొందరు జర్నలిస్టులు గత 15 రోజులుగా మాట్లడడం జరిగింది. మా పరిధిలో ఇది మాకు ఒక సర్వే లాంటిది. నాతో పాటుగా 11  మంది ఇందులో పాల్గొని ఈ వారంలో సుమారు 800  మందితో మాట్లాడాము. ఎపి లోని ఐదు పట్టణాలు, హైదరాబాద్, బెంగళూరు ఏరియాల్లోని వారితో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఎంపిక చేసుకున్న కొన్ని ప్రశ్నలను అడగడంతో పాటు కొన్ని అంశాలపై వారి అభిప్రాయాలను కూడా విన్నాము. అయితే వారిలో దాదాపు 500  మంది వెల్లడించిన విషయాలను మేము ప్రత్యేకంగా నోట్ చేసుకున్నాము. వాటిలో ఎక్కువమంది ఆలోచనలు, కొందరి అభిప్రాయాలు ఇలాఉన్నాయి. 

1. మోదీ నిజాయితీపరుడు.. ఆ విషయం ఒప్పుకుంటాం. కానీ ఆయనంటే మాకు ఇష్టంలేదు.
2. మోదీ ప్రభుత్వం ఐదేళ్లపాటు కుంభకోణాలు లేని పరిపాలన అందించి ఉండొచ్చు అయినా సరే మేము వ్యతిరేకిస్తాం.
3. మోదీ విదేశాంగ విధానం భేష్ .. కానీ ఆయనకు ఓటేయం 
4. చైనాకి, పాకిస్థాన్ కి బాగా బుద్ధి చెప్పారు ... అయినా సరే సమర్థించం.
5. రక్షణ పరంగా దేశాన్ని బలోపేతం చేసిన మాట నిజమే... అయితే ఏమిటట? 
6. మోదీ వచ్చాకా హిందువులకి విలువ, గుర్తింపు పెరిగాయి.. (ఇది హిందువులు చెప్పినది).. కానీ ఆయనను వ్యతిరేకిస్తూనే ఉంటాం.
7. మోదీ వలన మా ఆడ పిల్లలకి మేలు జరిగింది నిజమే (ఇది కొందరు ముస్లిముల మాట)..కానీ మేము మా శత్రుత్వాన్ని వదులుకోము.
8. మోదీ పాలనలో భారత్ అనేక రంగాల్లో గొప్ప పురోగతి సాధించింది అని ఒప్పుకుంటాం .. అయినా మాకు ఆయన నచ్చడు.  
9. ఆర్థిక నేరాలను అరికట్టే ప్రయత్నం, బ్యాంకు పరిరక్షణకు కృషి చేస్తున్నారు .. కానీ మాకు సంతృప్తి లేదు.
10. ప్రపంచ దేశాలు ఇండియాని ఎంత మెచ్చుకున్నా సరే.. మేము మాత్రం మోడీని మెచ్చుకోము.
11. దేశంలోని ప్రతి పేదవాడి ఆరోగ్యం కోసం 50 కోట్లమంది కవర్ అయ్యేలా మోదీ ఉచిత చికిత్సా పథకాన్ని తెచ్చారు.. అయినా సరే మేము మంచోడని అనం.
12. ఆయనెవరినీ ఓటుబ్యాంకు గా చూసి వాళ్ళని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేయలేదు...ఒప్పుకుంటాం కానీ ఆయన పరిపాలనని మాత్రం వ్యతిరేకిస్తాం.
13. మాకు చైనా,పాకిస్థాన్ అంటే గిట్టదు. కాంగ్రెస్ అవినీతికి కూడా మేము వ్యతిరేకం.. కానీ అవన్నీ వ్యతిరేకించే మోదీ కూడా మాకు వ్యతిరేకమే.
14. మోడీని వ్యతిరేకిస్తున్న పార్టీలు,వ్యక్తులు అందరూ అవినీతి పరులని తెలిసినా సరే... వాళ్ళ కంటే మోడీయే మాకు ప్రమాదకారి. 
15. ఇవాళ దేశానికి మోడీని మినహాయిస్తే ప్రత్యామ్నాయమే కనిపించడంలేదు. అయినా సరే ఆయన్ని ఒప్పుకోము. మోదీ వ్యతిరేకుల్లో ఎవరు ఏలినా మాకు ఇష్టమే. 
16. మోదీని ఓడిస్తే దేశం నష్టపోవచ్చు... ఒప్పుకుంటున్నాం.. పోతే పోనీయండి.. దేశం అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది.
అదేంటి ఇవన్నీ మంచి పనులు అని మీరే అంటున్నా సరే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే కొందరు చెప్పిన వివరణలు ఇలా ఉన్నాయి. 
1. ఆయన ఆంధ్రప్రదేశ్ కి శత్రువు.
2. పోలవరానికి డబ్బివ్వలేదు 
3. రాజధానికి డబ్బులివ్వలేదు 
4. చంద్రబాబుని అవమానించారు
5. ఆయనది గుజరాత్
6. ఉత్తరాది వాడు కాబట్టి 
7. ఖరీదైన బట్టలు వేసుకుంటాడు కాబట్టి 
8. హిందువుని అని చెప్పుకుంటాడు కాబట్టి
9. ముఖేష్ అంబానీతో చనువుగా ఉన్నాడు కాబట్టి
10. పెద