అజ్ఞాతవాసిని ఆదుకున్న చంద్రబాబు


పవన్‌కల్యాణ్‌ సినిమాకు రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రత్యేక అనుమతి రూపంలో ఇచ్చిన వెసులుబాట్లు చర్చకు దారి తీస్తున్నాయి. అజ్ఞాతవాసి సినిమా బుధవారం రిలీజ్‌ అయింది. ఇది పక్కా కమర్షియల్ సినిమా. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిచ్చింది. పదో తేదీ నుంచి 17 వ తేదీ వరకూ అజ్ఞాతవాసి సినిమాకు రాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏ తెలుగు సినిమాకు ఈ తరహా ప్రత్యేక ప్రదర్శనల అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. ఈ రాయితీ ఇవ్వడంపై సినీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం అదనంగా ఒక్క షో కు మాత్రమే అనుమతినిచ్చినట్లు సమాచారం. సమాజానికి సందేశం ఇచ్చే మంచి సినిమాలను, చారిత్రక సినిమాలను ప్రోత్సహించేందుకు అప్పుడ ప్పుడూ రాయితీలు ఇవ్వడం మామూలే. అయితే కమర్షియల్‌ సినిమాలకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించిన దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అస్మదీయులైన నందమూరి బాలకృష్ణ , పవన్ సినిమాలకు పన్ను మినహాయింపు ఇస్తుండడం విశేషం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం