కొనసాగుతున్న తలాక్ అక్రమాలు


తలాక్ బిల్లు పార్లమెట్ లో (రాజ్యసభ) ఆమోదం పొందని నేపథ్యంలో ఆ దురాచారం బాధితుల కన్నీటిగాధలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాను అడిగినట్టుగా భార్య తనకు వెంటనే తలాఖ్ ఇవ్వలేదనే కోపంతో భార్యను దారుణంగా కొట్టి సిగరెట్ తో కాల్చిన కసాయి భర్త వ్యవహారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బరాయిపూర్ లో వెలుగుచూసింది. బరాయిపూర్ కి చెందిన నూర్ ను ఆరేళ్ల క్రితం సదర్ పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. అదనంగా రూ.30వేలు కట్నం తీసుకురాలేదని సదర్ భార్యను వేధించి పుట్టింటికి పంపించాడు. నూర్ పుట్టింట్లో ఒంటరిగా ఉండగా అతడు వెళ్లి వెంటనే తలాఖ్ ఇవ్వమని అడిగాడు. దానికి నూర్ అంగీకరించకపోవడంతో ఆమెను కొట్టడమే కాకుండా సిగరెట్‌తో చేతిని కాల్చాడు. ఈ ఘటనపై నూర్ ఫిర్యాదు చేయగా పోలీసులు దిగి కేసు నమోదుచేసి ఆమెను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. తన భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని ఆమెను పెళ్లాడేందుకే తనను తక్షణం తలాఖ్ ఇవ్వమని భర్త ఒత్తిడి చేస్తున్నాడని నూర్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. తలాఖ్ పై బిల్లు పార్లమెంటులో ఉండగా ఈ ఘటన జరగిందని దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే బిమన్ బెనర్జీ కోరారు.

ముఖ్యాంశాలు