అగ్రిగోల్డ్‌ కేసులో 8 మంది డైరెక్టర్‌ల అరెస్ట్‌


అగ్రిగోల్డ్‌ కేసులో ఆ సంస్థకు సంబంధించిన 8 మంది డైరెక్టర్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి వైఎస్సార్‌ కడపజిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారికి ఈ నెల 23 వరకు రిమాండ్‌ విధించడంతో ఏలూరు కేంద్రకారాగారానికి తరలించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్‌ కాగా, పరారీలో ఉన్న 8 మంది డైరెక్టర్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి తమ ఎదుట హాజరు పరిచారని తెలిపారు. అరెస్టయిన అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లలో శివనారాయణ, వెంకటసుబ్రమణ్యం, శర్మ, ఉదయ భాస్కర్‌రావు, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, ఉమతో పాటు మరొకరు ఉన్నారన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us