ఇంతకీ ఆ పూజ ఎవరి కోసం?


విజయవాడ కనకదుర్గ ఆలయం లో జరిగిన పూజలు ఏవో వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనేది అర్థం అవుతోంది కానీ ఎవరి కోసమనేది మాత్రం బయటపడడంలేదు. కార్య నిర్వహణాధికారిగా సూర్య కుమారి ని ఏరి కోరి ప్రభుత్వమే తెచ్చుకుంది. ఆమె మొండి వైఖరి, పట్టుదల ఉన్న అధికారి తప్ప అవినీతిపరురాలు కాదని అందరూ చెబుతున్నారు. ఆమె వచ్చాక నిజానికి ఆలయ పాలన కాస్త గదిలో పడిందని కూడా అంటున్నారు. అయితే గుడిలో జరిగిన అర్థరాత్రి పూజల వ్యవహారం ఆమెను ఒక్కసారిగా విలన్ గా మార్చేశాయి. తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన పాలకవర్గమే ఈ పూజల వ్యవహారంలో మొదట గొంతెత్తి విమర్శలు చేసారు. వారు సాక్ష్యాధారం కూడా బయట పెట్టారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనాడు ఈవో ను వెనకేసుకొచ్చారు. ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించవద్దని పాలక వర్గాన్ని చివాట్లేసారు. ఇంకా మాట్లాడితే పాలకవర్గాన్ని రద్దు చేస్తామని హెచ్చరించారు. గుడిలో ఒక తప్పు జరిగిందని తమ పార్టీ మనుషులే చెబుతుంటే అయన స్పందన ఇలా ఉండడం ఒకవిధముగా ఆశ్చర్యకరం. ఇది ఆ అధికారిని కాపాడడం కోసమా, లేక ఆలయ ప్రతిష్టను కాపాడడం కోసమా లేక తమ వారి ప్రమేయం ఏదైనా ఉంటే దానిని కప్పెట్టడం కోసమా అనేది ఆయనకే తెలియాలి. అయితే మీడియా లో ఇదంతా అల్లరి కావడంతో తప్పని సరై విచారణ కమిటీ వేసారు. పోలీసు విచారణ కూడా జరిగింది. అందరూ ఒకటే తేల్చారు... అర్థరాత్రి పూజలు జరిగాయని! దీంతో తక్షణం చంద్రబాబు ఈఓ సూర్యకుమారిని బదిలీ చేశారు. పూజలు జరిగాయి.. కానీ జరగలేదని ఈఓ బొంకరు కాబట్టి ఆమెపై చర్య తీసుకున్నారు! మరి చంద్రబాబు కూడా అప్పట్లో ఇలాగె బుకాయించారు! సరే పూజలు జరిగాయి. ఎందుకు, ఎవరి కోసం అవి జరిగాయనేది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్నగా మారింది. అమ్మవారి మహిషాసురమర్దిని రూపాన్ని ఫోటో తీసి వాట్సప్ చేసారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ నిజాలే అనే గట్టిగా పలువురు వాదిస్తున్నారు. పెద్ద అధికారిని అందులోనూ మొండితనం జాస్తిగా ఉన్న సూర్యకుమారి అల్లాటప్పా వారి ఒత్తిళ్లకు లోంగే రకం కానేకాదు. పైగా ఆవిడా డబ్బుకు ఆశపడి ఇలాంటి పనులు చేస్తారనీ ఎవరూ అనుకోవడంలేదు. ఈ పూజలు ఎవరో వ్యక్తుల ప్రయోజనం కోసం కాబట్టే పూజలయ్యాకా ఫోటో పంపమన్నారు. పైగా ఈ నమ్మకాలున్నవాళ్ళు పూజ అయ్యాక ఫోటో పంపమనడం.. ఆ ఫోటోకి నమస్కరిస్తే పూజలో ఉన్న ఫలిస్తాం వస్తుందని అనుకోవడం ఏమిటసలు?! అర్థరాత్రి వేళ గర్భాలయం తలుపులు తెరచి ప్రత్యేక పూజలు చేయడం దేవుడిపై నమ్మకం ఉన్నవారు కచ్చితంగగా వామాచారంగానే భావిస్తారు. ఎవరిదో జాతక దోష నివారణకో, ఎదో లక్ష్యం కోసమో అమితమైన ఒత్తిడితో ఈ పూజలు చేయించారనేది సుస్పష్టం. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయంలోనే ఇప్పుడు రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇలాంటి నమ్మకాలు పెద్దగా లేవు కాబట్టి ఆయనను ఎవరూ అనుమానించడంలేదు. అయితే ఆయన సమీప బంధువుల విషయంలో మాత్రం ఇలాంటి అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వాస్తు విషయంలో ఆయన ప్రమేయం లేకుండానే గందరగోళం చాలా జరిగింది. పూజ అయ్యాకా ఫోటో తీసి ఈఓ స్వయంగా పంపారు అంటే, అవతలి వాళ్ల పలుకుబడి, అధికారం... ఇవి ఎంతటివనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పైగా అవతల ఉన్నది అమ్మవారి ఆరాధకులు కూడా అయి ఉండొచ్చు. పూజలు జరిపించుకున్న వారికి, చేసిన వారికీ, ఫెసిలిటేటర్ గా ఉన్న ఈఓ సూర్యకుమారికి మాత్రమే ఈ లోగుట్టు తెలుసు!

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం