టాప్ 10 ఎయిర్ పోర్టులు .. శంషాబాద్ @8

ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు (శంషాబాద్) టాప్‌ 10లో చోటు దక్కించుకుంది. 2019 కి గానూ విమానాశ్రయాల ర్యాంకింగ్‌లను ఎయిర్‌ హెల్ప్‌ సంస్థ విడుదల చేసింది. ఇందులో శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 8వ స్థానంలో నిలిచింది. 
ప్రపంచంలోనే అత్యుత్తమైన నంబర్ వన్ ఎయిర్‌పోర్టుగా ఖతార్‌లోని హమద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత జపాన్‌లోని టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు, గ్రీస్‌లోని ఏథెన్స్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో మూడో స్థానంలో నిలిచాయి. అమెరికా, యూకే నుంచి ఏ విమానాశ్రయాలు కూడా టాప్‌ 10లో చోటు దక్కించుకోలేకపోయాయి. ఎయిర్‌పోర్టు ఆన్‌టైం నిర్వహణ, సేవల నాణ్యత, ఆహారం, షాపింగ్‌ అవకాశాలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఎయిర్‌హెల్ప్‌ విమానా శ్రయాలకు ర్యాంకింగ్స్‌ ఇచ్చింది. 40 దేశాల్లోని 40వేల మంది ప్రయాణికులను ప్రశ్నించి వారి సర్వే ఆధారంగా ఈ జాబితా రూపొందించింది. 2015 నుంచి ఎయిర్‌హెల్స్‌ ఈ జాబితాను విడుదల చేస్తోంది. 
టాప్‌ 10 అత్యుత్తమ విమానాశ్రయాలు
1. హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, ఖతార్‌
2. టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం, జపాన్‌
3. ఏథెన్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, గ్రీస్‌
4. అఫోన్సో పెనా అంతర్జాతీయ విమానాశ్రయం, బ్రెజిల్‌
5. గాన్స్‌ లెచ్‌ వలేసా ఎయిర్‌పోర్టు, పోలాండ్‌
6. షెరెమెటేవో అంతర్జాతీయ విమానాశ్రయం, రష్యా
7. షాంఘి ఎయిర్‌పోర్టు సింగపూర్‌, సింగపూర్‌
8. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, భారత్‌
9. టెనెరిఫె నార్త్‌ ఎయిర్‌పోర్టు, స్పెయిన్‌
10. విరాకోపస్‌/కాంపినస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, బ్రెజిల్‌

Facebook
Twitter