నష్టాల ఊబిలో ఆర్టీసీ కుదేలు


డీజిల్ ధరలు పెరిగినందువలన ఆర్టీసీపై ఏడాదికి రూ.650 కోట్లు భారం పడుతోందని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు చెప్పారు. విజయవాడలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి రూ.735 కోట్లు నష్టం వచ్చిందని, 2016-17లో ఇది రూ.789 కోట్లకు పెరిగిందని చెప్పారు. 2017-18లో ఏకంగా రూ.1205 కోట్ల మేర ఆర్టీసీ నష్టపోయిందని వివరించారు. ఈ ఏడాది పీఆర్సీ, డీజిల్‌ ధరల ప్రభావం ఉన్నప్పటికీ కష్టించి పని చేసి నష్టాన్ని తగ్గించామని సురేంద్రబాబు వివరించారు. అలాగే ఆర్టీసీకి రూ.3,380 కోట్ల అప్పులు న్నాయన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రూ. 20 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందని, ఉద్యోగుల భవిష్యనిధికి 671 కోట్లు జమచేయాల్సి ఉందని వెల్లడించారు. ఇతరత్రా బకాయిలన్నీ కలిపి ఆర్టీసీ రూ. 6500 కోట్ల మేర చెల్లించాల్సి ఉందన్నారు. పన్ను రూపంలో రూ.316 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. పల్లె వెలుగు బస్సుల వల్ల ఏటా రూ.1409 కోట్ల నష్టం వస్తోందని చెప్పారు. కాలంచెల్లిన బస్సులను ఆపేస్తామన్నారు. 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులన్నీ మార్చాల్సి ఉందన్నారు. ఆలెక్కన 1666 కొత్త బస్సులు అవసరమని తెలిపారు.

ముఖ్యాంశాలు