హీరో విక్రమ్ తండ్రి మరణం


ప్రముఖ హీరో విక్రమ్‌ తండ్రి వినోద్‌రాజ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. వినోద్‌రాజ్‌ వయసు 80 ఏళ్లు. ఆయన మాజీ సైనికుడు, పలు కన్నడ, తమిళ చిత్రాలలోనూ, బుల్లితెర సీరియళ్లలోనూ నటించారు కూడా. తిరుపాచ్చి, గిల్లీ వంటి చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం సాయంత్రం స్థానిక మహాలింగపురంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిశారు. పలువురు సినీ ప్రముఖులు అంజలి ఘటించారు. ఆయన భౌతిక కాయానికి సోమవారం అంతక్రియలు జరిగాయి.

ముఖ్యాంశాలు