పాకిస్థాన్ జైళ్లలో 457మంది భారతీయులు

పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల సంఖ్య ఎంతో తెలుసా? 457 మంది భారతీయులు వివిధ పాకిస్థానీ జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్నారు. పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్ ఈ వివరాలను వెల్లడించింది. అక్కడి జైళ్లలోఉన్నభారత ఖైదీల వివరాలను పాకిస్తాన్ ఇవాళ భారత అధికారులకు అందించింది. అలాగే భారత జైళ్లలో ఉన్న పాకిస్తానీ ఖైదీల వివరాలను కూడా పాకిస్తాన్ హై కమిషన్‌ను అందించనున్నట్టు మన విదేశాంగ శాఖ తెలిపింది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య 2008 మే 21న జరిగిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం కుదిరింది. దీనిప్రకారం రెండు దేశాలూ ఈ వివరాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. ఏటా జనవరి 1, జూలై 1 తేదీల్లో ఖైదీల జాబితాను ఇచ్చిపుచ్చుకుంటారు. పాకిస్తాన్ జైళ్లలో ఉన్న వారిలో అత్యధికులు సముద్రంలో వేటకు వెళ్లిన జాలరులే. అరేబియా సముద్రం గుండా పాకిస్తాన్ పరిధిలోకి వెళ్లిన వారంతా పాకిస్తాన్‌లో బందీలుగా మగ్గుతున్నారు. 

Facebook