తల్లితో రాహుల్ జనవరి 1 వేడుకలు


కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీ అతి తక్కువమంది సన్నిహితుల మధ్య గోవా లో జనవరి 1 వేడుకలు జరుపుకున్నారు. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి నూతన సంవత్సర వేడుకలు కావడంతో రాహుల్ తన తల్లితో కలిసి వీటిని జరుపుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు వదిలిన పిదప సోనియా కొన్ని రోజులుగా గోవాలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. శనివారం గోవా తల్లి దగ్గరకు వెళ్లిన రాహుల్‌ అక్కడ ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపు కున్నారు. అయితే ఈ వేడుకకి ఎవరినీ ఆహ్వానించలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈమధ్య సోనియా గోవా బీచ్‌లో సైకిల్‌ తొక్కుతూ కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే.

ముఖ్యాంశాలు