స్పీడు చూపిస్తున్న రజనీ!


సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించగానే పనిలో దిగిపోయారు. చాలా స్పీడ్ గా కొత్త వెబ్‌సైట్‌, మొబైల్‌ అప్లికేషన్స్‌ను ఆయన ప్రారంభించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వీటిలో చేరాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. అందర్నీ ఒకచోటుకు చేర్చడానికి తాను వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్టు తెలిపారు అందులో. ఓటర్‌ ఐడీ నంబర్‌ను ఉపయోగించి ఈ వెబ్ సైటులో పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన ఆ వీడియో లో సూచించారు. దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి. వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని ఆదివారం ఆయన అభిమానుల సమావేశంలో చెప్పడం తెలిసిందే. శాసనసభ ఎన్నికల్లోగా కొత్త పార్టీ స్థాపిస్తానని, 234 స్థానాల్లోనూ పోటీ చేస్తానని చెప్పిన రజనీకాంత్ డబ్బు, పదవి పై ఆశతో తాను రాజకీయాల్లోకి రావడం లేదన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం