రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ శుద్ధిలో భాగంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని మంగళవారం తితిదే నిర్వహిం చనుంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. అనంతరం పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనం ఆలయ గోడలకు పూస్తారు. ఈ నేపథ్యంలో వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు శ్రీవారి దర్శనాన్ని తితిదే నిలిపివేయనుంది. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవ అష్టదళ పాదపద్మారాధ న సేవను రద్దు చేశారు. ఇతర ఆర్జిత సేవలన్నీ యథాతథంగా నిర్వహిస్తారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us