ఎంఐఎం కేసీఆర్ తోనే ..


ప్రగతిభవన్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ భేటీ అయ్యారు. పోలింగ్‌ అనంతర పరిణామాలపై వారిద్దరూ చర్చించారు. కేసీఆర్‌తో భేటీకి అసదుద్దీన్ మోటార్ బైక్ పై ప్రగతి భవన్‌కు బైక్‌పై చేరుకొని ఆశ్చర్య పరిచారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డానికి కొన్ని గంటల ముందు ఇరు పార్టీ అగ్రనేతల భేటీ ప్రాధా న్యం సంతరించుకుంది. తెరాస అధినేత కేసీఆర్‌ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారంటూ భేటీ కొద్దిసేపటి ముందు అసద్‌ ట్వీట్‌ చేశారు. ఎంఐఎం కేసీఆర్‌ వెంటే ఉంటుందని కూడా ఆ ట్వీట్ లో స్పష్టం చేశారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం