చైనా ఆక్రమణధోరణిపై మోదీ ఆగ్రహం

భారత్ ఏ దేశాన్నీ ఆక్రమించుకోవాలని, వారి పరిధిలోకి వెళ్లాలని ప్ర‌య‌త్నించ‌బోద‌ని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. భారత్, చైనా సరిహద్దుల్లో చైనా సైనికులే అత్యుత్సాహాన్ని చూపుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భారత భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత సంతతి పార్లమెంటేరియన్లు, రాజకీయ నాయకులను కలుపుతూ నిర్వహిస్తున్న తొలి సదస్సును ప్రారంభించిన అనంతరం మోడీ మాట్లాడారు. చైనా ప్రారంభించిన 'వన్ బెల్ట్ వన్ రోడ్' ప్రాజెక్టుపై విమర్శలు గుప్పించారు.భారత విదేశాంగ విధానం మానవతా విలువలతో కూడుకుని ఉంటుందే తప్ప వ్యాపార పరంగా లాభాలు, నష్టాలు బేరీజు వేసుకునేలా ఉండదని వ్యాఖ్యానించారు. ఇరుగు పొరుగు దేశాల అవసరాలను బట్టి తమ నిర్ణయాలు మారుతుంటాయని, వారి వనరులపై తామెన్నడూ కన్నేయబోమని, ఇదే సమయంలో భారత సార్వభౌమత్వానికి విఘాతం కలిగితే ఊరుకునేది లేదని మోడీ హెచ్చరించారు. గత మూడు నాలుగేళ్లుగా ఇండియాను మార్చి చూపించామని అన్నారు. కాగా ఈ సదస్సుకు 23 దేశాల నుంచి 134 మంది పార్లమెంటేరియన్లు హాజరయ్యారు.

Facebook