ఆధార్ గోప్యత ప్రమాదానికి ఇదిగో విరుగుడు


ఆధార్‌ గోప్యత పై ఆందోళనలు తలెత్తుతున్న నేపథ్యంలో ‘భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ’ (ఉడాయ్‌) దీనికి ఓ విరుగుడు కనిపెట్టింది. మొత్తంగా 12 అంకెల బయోమెట్రిక్‌ సంఖ్యను ఎవరికైనా చెప్పే బదులు వర్చ్యువల్‌ ఐ.డి.ని ఎవరికి వారే ఉడాయ్‌ వెబ్‌సైట్‌ ద్వారా సృష్టించుకుని, దానిని చెబితే సరిపోయేలా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ రెండు సంఖ్యల్ని ఉడాయ్‌ అనుసంధానం చేసుకుంటుంది. సిమ్‌కార్డు సహా వివిధ అవసరాల కోసం ఈ ఐడీ మాత్రమే చెబితే సరిపోతుంది. తద్వారా అసలు ఆధార్‌ సంఖ్య గోప్యంగానే ఉంటుంది. పేరు, చిరునామా, ఫోటో వంటి పరిమిత వివరాలు మత్రమే ఈ వర్చ్యువల్‌ ఐ.డి. ద్వారా తెలుస్తాయి. సాధారణంగా ఏ అవసరానికైనా ఇవి సరిపోతాయి. ఇలా ఒక్కొక్కరు ఎన్ని గుర్తింపులనైనా సృష్టించుకోవచ్చు. అవి పరిమిత కాలమే చెల్లుబాటవుతాయి. కొత్తది రాగానే పాతది దానంతట అదే రద్దయిపోతుంది... ఉదహరనకి ఓటీపి లా అన్నమాట. ఈ 16 అంకెల యాదృచ్ఛిక సంఖ్యను ఆమోదించడాన్ని ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి ఉడాయ్‌ అనుమతించనుంది. గుర్తింపు వివరాలను కోరే సంస్థలన్నీ జూన్‌ ఒకటో తేదీ నుంచి ఈ గుర్తింపును ఆమోదించడం తప్పనిసరి కానుంది. దీనికి తగ్గట్టుగా గడువులోగా తమతమ వ్యవస్థల్లో మార్పులు చేసుకోని సంస్థలు ఆర్థికంగా కొంత నష్త పరిహారం కూడా చెల్లించాల్సి వస్తుంది. ఆధార్‌ సంఖ్య మాదిరిగానే ఈ సంఖ్యను వినియోగించుకోవచ్చని ఉడాయ్‌ ఒక ఉత్తర్వులో పేర్కొంది. వాస్తవిక గుర్తింపుతో పాటు ‘పరిమిత కేవైసీ’ పద్ధతినీ ఉడాయ్‌ తీసుకువస్తోంది. ‘మీ వినియోగదారుని తెలుసుకో’ (కేవైసీ) పేరుతో బ్యాంకులు సహా అనేక సంస్థలు ఈ వివరాలను కోరుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనూ కేవలం కావాల్సినంత మేరకే వివరాలను అధీకృత సంస్థకు ఇవ్వడానికి పరిమిత కేవైసీ పద్ధతిని రూపొందించింది. ఇకపొతే ఆధార్‌ గోప్యతకు ఎప్పటికైనా ముప్పే అని ఈమధ్య వెల్లడైన అధ్యయనంతో తమకు సంబంధం లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం