5 రోజులపాటు జైసింహా 24x7  ప్రత్యేక షోలు


కొత్త సినిమాల ప్రత్యేక షో ల అనుమతి విషయంలో కూడా పలుకుబడులు, పోటాపోటీలు, పైరవీలు రాజ్యమేలుతున్నాయి. నందమూరి బాలకృష్ణ కథానాయకు డిగా నటించిన చిత్రం ‘జై సింహా’ సంక్రాంతి సందర్భంగా శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సినిమాకు 24x7 ప్రత్యేక ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ‘జై సింహా’ సినిమాను జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు 24x7 ప్ర్యతేక ప్రదర్శన లకు అనుమతిస్తున్నాం అని తెలిపిన ప్రభుత్వం అందుకు చెప్పిన కారణం ఏమిటంటే జనాల రద్దీ, బ్లాక్‌ టికెట్ల అమ్మకాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం అని! పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాకు కూడా ప్రత్యేక ప్రదర్శనల కు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆ తరువాత ఈ నిర్ణయాన్ని రద్దు చేసింది. ఏపీలో మాత్రం ప్రత్యేక ప్రదర్శనలు కొనసాగాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం