పోలవరం నిధుల కోసం ప్రధాని చెంతకు బాబు


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం 10.40 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిధులు, రాష్ట్ర విభజన చట్టంలోని వివిధ అంశాలు, వారి మధ్య చర్చకు వస్తాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కూడా చంద్రబాబు కోరనున్నారు. గత 5వ తేదీన తెదేపా ఎంపీలు మోదీని కలిసి ఈమేరకు వినతి పత్రం ఇచ్చారు. నాబార్డు ద్వారా ఈఏపీలకు నిధులు అందించాలని గతంలోనే ఆర్థిక మంత్రి జైట్లీకి చంద్రబాబు లేఖ రాశారు. వీటిపై కూడా బాబు ప్రధానితో చర్చిస్తారని చెబుతున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం