ఈ ఎమ్మెల్యే ఉగ్రవాదుల సోదరుడట!


ఉగ్రవాదులు తమ సోదరులని, భద్రతా దళాల చేతుల్లో హతమవుతున్న వాళ్లు అమరులని వదరుతూ జమ్ముకశ్మీర్‌ అధికార పార్టీ పీడీపీ ఎమ్మెల్యే ఐజాజ్‌ అహ్మద్‌ మిర్‌ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. గురువారం ఆయన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ మూర్ఖపు వ్యాఖ్యలు చేశారు. ‘హురియత్‌ నేతలు వేర్పాటువాదులు, ఉగ్రవాదులతో మాట్లాడి కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాల్సిన సమయం వచ్చిందని అహ్మద్ మిర్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అల్లర్లను నిలువరించాలంటే వారితో చర్చలు జరపాలన్నారు. వాళ్లని ఉగ్రవాదులు లేదా ఇంకేమైనా పిలవండి. కానీ వాళ్లందరూ కశ్మీరీలు, మా సోదరులు అని తెలిపారు. వారి మరణాన్ని రాజకీయం చేయొద్దని అందరినీ కోరుతున్నానని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉగ్రవాదులను వెనకేసుకొస్తూ మాట్లాడటం పట్ల భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం