ప్రభావశీల ప్రపంచ నేత నరేంద్ర మోదీ


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకుల్లో అత్యంత ప్రభావశీలత కనబర్చిన మొదటి ముగ్గురిలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థానం సంపాదించి భారత కీర్తి పతాకను రెపరెపలాడించారు. నాయకత్వ పట్టికలో మొట్టమొదటిసారి ఒక భారత ప్రధాని అత్యంత ప్రభావ శీల ప్రపంచ నాయకత్వ ర్యాంకింగ్ లో 3 వ స్థానాన్ని సాధించడం అపూర్వ విశేషం. ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సర్వే సంస్థ గాల్ అప్ ఇంటర్నేషనల్ ఈ సంగతి ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు లని దాటి మరీ మోదీ ఈ ర్యాంకు సాధించడం అబ్బురమనే చెప్పాలి. ఇది ప్రపంచ వ్యాప్తంగా గల యావత్ భారతీయులకు అందరికీ గర్వకారణం. ఈ సర్వే లో మొదటి ర్యాంక్ జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ కు దక్కగా రెండవ స్థానాన్ని ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడు ఎమ్మానుల్ మక్రోన్ ఆక్రమించారు. మూడవ స్థానంలో మోదీ నిలిచారు. దావోస్ సదస్సుకి మొట్టమొదటి సారి హాజరు కాబోతున్న భారత ప్రధానమంత్రి మోదీకి ఈ ర్యాంకింగ్ తో ఆత్మవిశ్వాసం మరింత ఇనుమడిస్తుంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం