ఇంగ్లిష్ సినిమా నిడివిలో 2.o

దర్శకుడు శంకర్‌. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కాంబినేషన్ లోని ప్రతిష్టాత్మక చిత్రం 2.o మేకింగ్ లోనే కాదు..నిడివిలో కూడా హాలీవుడ్ చిత్రంలానే ఉంటుంది!  'రోబో'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ  సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. 2.o సినిమా మొత్తం నిడివి వంద నిమిషాలు మాత్రమేనట. అంటే గంట 40 నిమిషాలు మాత్రమే. ఒకప్పుడు భారతీయ సినిమా నిడివి మూడు గంటలు ఉంటే.. ఇప్పుడు రెండున్నర గంటలకు తగ్గింది. కమర్షియల్‌ సినిమాలు అన్నీ రెండు గంటలకుపైగా నిడివితో ఉండటం సర్వసాధారణం. కానీ ఆ ట్రెండ్‌కు భిన్నంగా కేవలం గంట 40 నిమిషాల నిడివితోనే ఈ అత్యంత భారీ సినిమాను శంకర్‌ తీశారు. సాగదీసే,విసిగించే సీన్స్‌ లేకుండా.. చూస్తున్నంతసేపు ఉత్కంఠగా ఉండేలా సినిమాను క్రిస్పీ గా ఎడిట్ చేయబోతున్నారట. ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ, అరబిక్‌ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌14న విడుదల చేయనున్నారు. లైకా ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న ఈ  సినిమాలో అక్షయ్‌కుమార్‌, అమీజాక్సన్‌ తదితరులు తారాగణం. 

Facebook
Twitter