సుప్రీం జడ్జిగా మహిళా లాయర్ నియామకానికి ఛాన్స్

ఓ మహిళా లాయర్ నేరుగా సుప్రీంకోర్టుకు జడ్జిగా వచ్చేందుకు రంగం సిద్ధమైంది. సుప్రీం కోర్టులో ఖాళీగా ఉన్న జడ్జిల స్థానాలను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజీయం ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కె.ఎం.జోసెఫ్, మహిళా సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్ర ల పేర్లు ప్రతిపాదిస్తూ వారిని న్యాయమూర్తులుగా నియమించేందుకు అంగీకారం కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి పంపింది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపితే నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన తొలి మహిళా న్యాయవాది గా ఇందు మల్హోత్రా చరిత్ర సృష్టిస్తారు. సర్వోన్నత న్యాయస్థానానికి ఎంపికైన ఏడో మహిళా న్యాయమూర్తిగా కూడా ఆమె నిలుస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్.భానుమతి ఉన్నారు. 1989లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఫాతిమా బీవి నియమితులయ్యారు. ఆమె తర్వాత జస్టిస్ సుజాత వి. మనోహర్, జస్టిస్ రుమా పాల్, జస్టిస్ జ్ఞాన సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ న్యాయమూర్తులు అయ్యారు.సుప్రీం జడ్జిగా మహిళా లాయర్ నియామకానికి ఛాన్స్ ఓ మహిళా లాయర్ నేరుగా సుప్రీంకోర్టుకు జడ్జిగా వచ్చేందుకు రంగం సిద్ధమైంది. సుప్రీం కోర్టులో ఖాళీగా ఉన్న జడ్జిల స్థానాలను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజీయం ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కె.ఎం.జోసెఫ్, మహిళా సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్ర ల పేర్లు ప్రతిపాదిస్తూ వారిని న్యాయమూర్తులుగా నియమించేందుకు అంగీకారం కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి పంపింది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపితే నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన తొలి మహిళా న్యాయవాది గా ఇందు మల్హోత్రా చరిత్ర సృష్టిస్తారు. సర్వోన్నత న్యాయస్థానానికి ఎంపికైన ఏడో మహిళా న్యాయమూర్తిగా కూడా ఆమె నిలుస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్.భానుమతి ఉన్నారు. 1989లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఫాతిమా బీవి నియమితులయ్యారు. ఆమె తర్వాత జస్టిస్ సుజాత వి. మనోహర్, జస్టిస్ రుమా పాల్, జస్టిస్ జ్ఞాన సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ న్యాయమూర్తులు అయ్యారు.