థాయ్ లో భారత - పాకిస్థాన్ చర్చలు !


భారత, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుల మధ్య సుమారు మూడు వారాల కిందట ఒక ప్రత్యేక సమావేశం జరిగిందని వెలుగులోకి వచ్చింది. ఈ సమావేశం థాయ్ లాండ్ లో జరిగిందని.. దీనికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్, పాకిస్థాన్ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) నసీర్ ఖాన్ జంజువా హాజరై చర్చించారని సమాచారం. ప్రధానంగా భారత సీమాంతర ఉగ్రవాదం విషయాన్ని ప్రస్తావించింది. చర్చలు, ఉగ్రవాదం ఒకే సారి కొనసాగజాలవనే విషయాన్నిదోవల్ పొరుగుదేశానికి స్పష్టం చేసారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. ఇండియా, పాక్ మధ్య వివిధ స్థాయిల్లో చర్చల ప్రక్రియ నిరంతరాయంగా సాగుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. డిజిఎంఒ స్థాయిలో, బిఎస్ఎఫ్, పాకిస్థాన్ రేంజర్స్ లెవెల్ లో ఇవి సాగుతూనే ఉన్నాయన్నారు. అదేవిధంగా ఇపుడు జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం కూడా జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు