EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో  కొత్త మంత్రులుగా కిడారి శ్రావణ్‌కుమార్‌, ఎన్‌.ఎమ్‌.డి. ఫరూక్‌ ప్రమాణస్వీకారం చేశారు. వీరిచేత ఉండవల్లిలోని సీఎం నివాసం ప్రజావేదికలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించారు. ప్రమాణం అనంతరం ఇద్దరు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమానికి మంత్రులు, పార్టీనేతలు హాజరయ్యారు. ఫరూక్‌కు మైనారిటీ సంక్షేమంతోపాటు ముఖ్యమంత్రి వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖ కేటాయించే అవకాశం ఉంది. గిరిజన సంక్షేమశాఖను శ్రావణ్‌కు అప్పగించనున్నట్లు సమాచారం. కిడారి శ్రావణ్‌కుమార్‌ చట్టసభల్లో సభ్యుడు కాకుండానే నేరుగా మంత్రివర్గంలో స్థానం పొందారు. 1995లో నందమూరి హరికృష్ణ తర్వాత ఇలా అవకాశం లభించింది ఈయనకే. ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రివర్గంలో చేరితే ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపే సమయం ఉండటంతో అరకు స్థానానికి ఉపఎన్నిక జరిగే అవకాశం లేకపోయింది. శాసనమండలి స్థానమూ ఖాళీగా లేదు. దీంతో... చట్టసభల్లో సభ్యుడు కాకున్నా ఆరు నెలల పాటు మంత్రిగా కొనసాగే అవకాశాన్ని శ్రావణ్‌కి కల్పిస్తున్నారు. ఈలోగానే సాధారణ ఎన్నికలు వస్తాయి గనుక అరకు నుంచి శ్రావణ్‌నే పార్టీ అభ్యర్థిగా బరిలో నిలపనున్నారు.

Facebook