గనుల మాయగాడు గాలి అరెస్టు


మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిని సీసీబీ పోలీసులు ఆదివారం అరెస్ట్‌చేశారు. నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి అర్ధరాత్రి 3గంటల వరకు ఏకధాటిగా గాలిని విచారించిన సీసీబీ పోలీసులు ఆదివారం ఉదయం 9గంటల నుంచే మళ్లీ విచారణ ప్రారంభించారు. అంబిడెంట్ ఎండీ ఫరిద్, జనార్దన్‌ రెడ్డి పీఏ అలీఖాన్‌ను బయటకు పంపినా జనార్దన్‌ రెడ్డిని సీసీబీ కార్యాలయంలోనే ఉంచారు. విచారణ తర్వాత సీసీబీ పోలీసులు గాలి జనార్దన్‌ రెడ్డి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. కేసుకు సంబంధించి ఆదివారం ఆయనతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు విచారించారు. గాలి సూచన మేరకు రూ.18కోట్ల నగదును ఆర్టీజీఎస్ రూపంలో బదిలీ చేసేందుకు సహకరించిన బెంగుళూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి బ్రిజేష్ రెడ్డి, ఫైజల్, జయరాంలను పోలీసులు ప్రశ్నించారు. ఈ విచారణ ప్రక్రియను 300పుటల్లో రాతపూర్వకంగా, వీడియో చిత్రీకరణ ద్వారా భద్రపరచారు. అనంతరం ఐపీసీ 120బి, 201 సెక్షన్ల కింద గాలిని అరెస్ట్ చేశారు. కేసును దారి తప్పించేందుకు కుట్ర పన్నడం, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించిన అభియోగంపై గాలిని అరెస్ట్ చేసినట్లు సమాచారం

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం