కాంగ్రెస్ హవా.. టీఆరెస్ జోరు.. భాజపా బేజారు


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉత్కంఠభరిత వాతావరణంలో జరిగిన కౌంటింగ్ లో వెలువడ్డాయి. ఐదు రాష్ట్రాల్లో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణాలో మాత్రమే అధికారపార్టీ పవర్ నిలుపుకోగలిగింది. మిగిలిన నాలుగు చోట్లా అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో పాలకపక్షాలు మారుస్తూ ప్రజలు తీర్పు చెప్పారు. మధ్యప్రదేశ్ లో హోరాహోరీ వాతావరణం ఉన్నప్పటికీ ప్రజాతీర్పు అయితే పాలకపక్షం బిజెపికి వ్యతిరేకమే. మిజోరాంలో మూడు దఫాలుగా గెలుస్తూ వచ్చిన కాంగ్రెస్ ని ఈసారి అక్కడ ప్రజలు తిరస్కరించారు. మిజో నేషనల్ ఫ్రంట్ కి పట్టం కట్టారు. రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని ఎన్నుకున్నారు. కౌంటింగ్ లో వెలువడిన ఫలితాల సరళి ఇలా ఉంది.. ఎర్లీ లీడ్స్ @8-30 AM తెలంగాణలో తెరాస ఆధిక్యం ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ హోరాహోరీ రాజస్థాన్ కాంగ్రెస్ ఆధిక్యం మహాకూటమి హాహాకారాలు మొదలు! @9-10 AM తెలంగాణాలో తెరాస మధ్యప్రదేశ్ లో భాజపా రాజస్థాన్ లో కాంగ్రెస్ మిజోరాం, చత్తీస్ గఢ్ ఇంకా అనిశ్చితి @10-10 AM తెలంగాణాలో తెరాస తిరుగు లేని ఆధిక్యత (90) మహాకూటమి 15 మధ్యప్రదేశ్ లో భాజపా , కాంగ్రెస్ హోరాహోరీ (106 -102) రాజస్థాన్ లో కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీ (100) బిజెపి 73 చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ఆధిక్యత (60)... బిజెపి 23 మిజోరాం ఎం ఎన్ఎఫ్ ఆధిక్యత (24) కాంగ్రెస్ 8 @12-00 noon తెలంగాణాలో తెరాస 85 కాంగ్రెస్-14, తెదేపా-1, బిజెపి-1, ఎంఐఎం- 5 మధ్యప్రదేశ్ లో భాజపా 113 , కాంగ్రెస్ 106, ఇతరులు 5 రాజస్థాన్ లో కాంగ్రెస్ 94 బిజెపి 81, ఇతరులు 3 చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ 64... బిజెపి 18 ఇతరులు 23 మిజోరాం ఎంఎన్ఎఫ్ 29, కాంగ్రెస్ 6, ఇతరులు 1 @1-10 PM తెలంగాణాలో తెరాస 78 కాంగ్రెస్-19, తెదేపా-2, బిజెపి-2, ఎంఐఎం- 4 మధ్యప్రదేశ్ లో భాజపా 113 , కాంగ్రెస్ 108, ఇతరులు 9 రాజస్థాన్ లో కాంగ్రెస్ 91 బిజెపి 86, ఇతరులు 22 చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ 58... బిజెపి 23 ఇతరులు 8 మిజోరాం ఎంఎన్ఎఫ్ 25, కాంగ్రెస్ 6, ఇతరులు 9 @2-30 PM తెలంగాణాలో తెరాస 88 కాంగ్రెస్-19, తెదేపా-2, బిజెపి-2, ఎంఐఎం- 6 మధ్యప్రదేశ్ లో భాజపా 105 , కాంగ్రెస్ 110, ఇతరులు 11 రాజస్థాన్ లో కాంగ్రెస్ 105 బిజెపి 67, ఇతరులు 25 చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ 67... బిజెపి 17 ఇతరులు 5 మిజోరాం ఎంఎన్ఎఫ్ 28, కాంగ్రెస్ 5, బిజెపి 1

ముఖ్యాంశాలు