మసకబారిన చంద్రబాబు తెలివి


అపర చాణుక్యుడు చంద్రబాబు తెలివి మసకబారింది. తెలంగాణా ఎన్నికలకి ఆయన దూరంగా ఉంటే బాగుండేది! అనాలోచితంగా ఆయన ఈ ఎన్నికల్లో దూరారు. దీనివలన ఇప్పుడు తెలుగుప్రజల నాడి ఆయన కి వ్యతిరేకంగా ఉందని అందరికీ అర్థం అయిపోయి పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో చంద్రబాబు కంటే ఎంతో జూనియర్లు అయినా వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితి ఉహించబట్టే ఈ ఎన్నికలకి దూరంగా ఉండి పరువు కాపాడుకున్నారు. కానీ ఎంతో అనుభవజ్ఞుడు, తెలివైనవాడు అయినా కూడా బాబు పరువు తీసుకున్నారు. దీనికి కారణం ఒక్కటే.. చంద్రబాబుకి బిజెపిపై పెరిగిపోయిన అక్కసు, దుగ్ధ. మోడి ని తిట్టడానికి ఎదో ఒక వేదిక దొరికితే చాలని తాపత్రయపడుతున్న చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్ని కూడా అందుకు వాడుకుని పెద్ద తప్పు చేసారు. కేసీఆర్ ని విమర్శించడం ద్వారా తెలంగాణ వారిలో ప్రాంతీయాభిమానాన్ని తెలియకుండానే బాబు రెచ్చగొట్టారు. ఫలితమే ఈ కారు జోరు. చంద్రబా బు ఈ ఎన్నికలకి దూరంగా ఉంటే రెండు జరిగేవి. ఒకటి బాబుకి పరువు దక్కి ఉండేది.. రెండు.. టీఆరెస్ మరీ ఇంత ఆధిక్యతతో గెలిచేది కాదు. ఇదంతా బాబు పుణ్యమే. మొత్తానికి మోడీ మీద ఏడుపు బాబు కొంప ముంచింది. తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబుదే కీలకపాత్ర! ఇదే ఇప్పుడు అన్ని ఛానళ్లలో చర్చనీయాం శం!! బాబు రావడంతోనే తెలంగాణాలో వార్ వన్ సైడ్ అయిపోయిందని ప్రతి నాయకుడూ సెటైర్ వేయడమే. చివరికి ఐరన్ లెగ్ గా పేరుపడిన రాహుల్ గాంధీ కూడా చంద్రబాబుది ఐరన్ లెగ్గేమో అని భ్రమపడి, భయపడే పరిస్థితి ఏర్పడిందిప్పుడు.

ముఖ్యాంశాలు