కార్లను తొక్కించేసారు... అనుమతి లేని దిగుమతులపై కొరడా

ముందస్తు అనుమతులు తీసుకోకుండా దేశంలోకి అత్యంత ఖరీదైన కార్లను దిగుమతి చేసినందుకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటిరెట్టో ఓ గట్టి పాఠం చెప్పారు. 20 లగ్జరీ కార్లను దగ్గరుండి బుల్డోజర్లతో తొక్కించారు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటిరెట్టో. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆడి, మెర్సిడిస్ బెంజ్ తదితర కంపెనీల కార్లను మనీలాలోని ఓ ప్రాంతానికి చేర్చగా, వాటిపైకి బుల్డోజర్లను ఎక్కించారు. వీటి విలువ సుమారు 11,83,000 యూఎస్ డాలర్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే డ్రగ్స్, అక్రమ ఆయుధ వ్యాపారంపై ఉక్కుపాదం మోపి, ఎంతోమందికి మరణదండన విధించేలా చేసిన రోడ్రిగో ఇప్పుడు అక్రమ దిగుమతులపైనా దృష్టి పెట్టారు. 

Facebook
Twitter