రష్యా విమాన ప్రమాదంలో ఉగ్ర కోణం !


రష్యాకు చెందిన ప్రయాణికుల విమానం ఆదివారం రష్యా రాజధాని మాస్కోలోని దోమోడెడోవో విమానాశ్రయం నుంచి బయలుదేరిన రెండు నిమిషాలకే కూలిపోయి 71 మంది మరణించారు. ఈ విమానంలోని యాంటీ ఐసింగ్‌ సిస్టమ్‌లో సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్‌లో ఐస్‌ ఇరుక్కుని విమానంలో మంటలు వ్యాపించి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదం వెనక ఉగ్రవాదుల హస్తం అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నది. విమానంలో సమస్య ఎదురైనప్పుడు సిబ్బంది ఏటీసీకి ఫిర్యాదు చేయకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక సమస్య ఎదురైనప్పుడు చీఫ్‌ పైలట్‌ విమానాన్ని ల్యాండ్‌ చేసేందుకు ప్రయత్నించి ఉంటాడని అయితే అప్పటికే చేయి దాటిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. విమానానికి చెందిన రెండో బ్లాక్‌బాక్స్‌ను రష్యా దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. విమాన శకలాలు దాదాపు అరకిలోమీటరు దూరం ఎగిరిపడినట్లు అధికారులు తెలిపారు. విమానం దానంతట అదే కూలిపోతే శకలాలు ఇలా సుదూరం పడే అవకాశం లేదని... దీన్ని బట్టి విమానంలో పేలుడు సంభవించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రష్యాలో రికార్డు స్థాయి హిమపాతం, కాలం చెల్లిన విమానాల వినియోగం కారణంగా రష్యాలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం