ఆరెస్సెస్ దేశరక్షణ వ్యాఖ్యలపై రాగా మండిపాటు


దేశ రక్షణ కోసం అవసరమైతే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను సరిహద్దులకు పంపిస్తామని మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ విమర్శలు గుప్పించారు. ఇది దేశం కోసం అమరులైన సైనికుల సేవలను అగౌరవపరచడ మేనంటూ ట్విటర్‌లో విమర్శించారు. ఆదివారం బిహార్‌లో మోహన్‌ భగవత్‌ తన సంస్థ ప్రతినిధులతో మాట్లాడుతూ దేశ రక్షణ కోసం అవసరమైతే రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తలకు మూడు రోజుల శిక్షణ ఇచ్చి సరిహద్దులకు పంపిస్తామ న్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశం కోసం అమరులైన జవాన్ల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు చాలా అవమానకరంగా ఉన్నాయి. ఈ మాటలు జాతీయ జెండాను , ప్రతిఒక్క భారతీయుడిని అవమానపరిచేలా, దేశం కోసం సైనికులు చేసిన పోరాటాన్ని తక్కువ చేసేలా ఉన్నాయి అని ధ్వజ మెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మిలిటరీ సంస్థ కాదు. కానీ మిలిటరీ వాళ్లు పాటిస్తున్న క్రమశిక్షణ మా కార్యకర్తలు కూడా పాటిస్తారు. ఒకవేళ దేశానికి మా అవసరం వస్తే, రాజ్యాంగం అనుమతిస్తే ఆరు నుంచి ఏడు నెలల్లో సైన్యాన్ని తయా రు చేయగలం. ఇప్పుడే కావాలంటే మూడు రోజుల్లోనే వారిని సిద్ధం చేయగలం. అందుకు తగిన సామర్ధ్యం మాకుంది’ అని మోహన్‌ భగవత్‌ బిహార్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ విమర్శల నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ స్పందించింది. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల క్రమశిక్షణను గురించే భగవత్‌ ఈ వ్యాఖ్యలు చేశారని, అయితే కాంగ్రెస్‌ వీటిని వక్రీకరించిందని సంస్థ ప్రతినిధి మన్మోహన్‌ వైద్య వెల్లడించారు.

ముఖ్యాంశాలు