కురంగణి అడవుల్లో కార్చిచ్చు .. విద్యార్థులు బలి


తమిళనాడు థేని జిల్లా కురంగణి అడవుల్లో కార్చిచ్చు రేగింది. ఉన్నటుంది మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో ట్రెకింగ్ కి వెళ్లిన వివిధ కళాశాలల విద్యార్థులు వాటిలో చిక్కుకున్నారు. ఎనిమిది మంది విద్యార్థులు మృతి చెందారు. ఇంతవరకూ పది మందిని కాపాడారు. ఇంకా పది మంది విద్యార్థులు అడవిలోనే ఉండిపోయారు. సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. 18 మందికి తీవ్ర గాయాలు.. ఆరుగురి పరిస్థితి ఇంకా విషమం. నలుగురి ఆచూకీ తెలియడంలేదు. కాగా విద్యార్థులతో పాటు ఐదారుగురు చిన్న పిల్లలు కూడా ఉన్నారని సమాచారం. ముఖ్యమంత్రి పళనిస్వామి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటన స్థలానికి హెలీకాఫ్టర్లను పంపారు. కలెక్టర్ పల్లవి అక్కడికి చేరుకొని సహాయ కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తున్నారు.

ముఖ్యాంశాలు