పాపికొండ నేషనల్ పార్క్ పరిధిలో బటర్ ఫ్లై మీట్


ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ విభాగం (ఆంధ్రప్రదేశ్), ఇగ్రీ ఫౌండేషన్ మరియు బటర్ ఫ్లై రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (భీమ్ తాల్, ఉత్తరాఖండ్) భాగస్వామ్యంలో ఈనెల 8,9,10 తేదీలలో బటర్ ఫ్లై మీట్ -2018 నిర్వహించారు. పాపికొండ జాతీయవనం (నేషనల్ పార్క్)లోప్రారంభమైన ఈ వర్క్ షాపు కోరింగ అభయారణ్యంలో కొనసాగింది. సీతాకోక చిలుకల పరిరక్షణకు సంబంధించి ఇటువంటి వర్క్ షాపు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ లోఇదేతొలిసారి కావడం విశేషం. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన సీతాకోక చిలుకల కు సంబంధించిన పరిశోధకులు, ఔత్సాహిక పరిశీలకుల తోకూడిన ఈ వర్క్ షాప్ వివిధ కీలకాంశాలు చర్చించింది. అరుదైన వివిధ సీతాకోకచిలుక జాతులు, వాటి వ్యాప్తి, వాటి ఉనికికి ఏర్పడుతున్న ఇబ్బందులు ఇంకా వాటిపరిరక్షణకు తీసుకోవలసిన చర్యలను చర్చించారు. మాత్స్, తూనీగల (డ్రాగన్ ఫ్లై) గురించి కూడా ఈ సమావేశం దృష్టి సారించింది. బటర్ ఫ్లై రీసెర్చ్ సెంటర్ (ఉత్తరాఖండ్) నుంచి వచ్చిన ప్రసిద్ధ పరిశోధకుడు పీటర్ స్మెటాసెక్ ముఖ్య రిసోర్స్ పర్సన్ గావ్యవహరించారు. పరిశోధకులు, అటవీశాఖ సిబ్బందితో పాపికొండ నేషనల్ పార్క్, కోరింగ అభయారణ్య ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన జరిగింది. కేరళ, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలనుంచి పలువురు పరిశోధకులు ఈ వర్క్ షాప్ కి హాజరయ్యారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పూర్వ సంచాలకులు డాక్టర్ జె ఆర్ బి ఆల్ఫ్రెడ్ హాజరై సీతాకోకచిలుకల పరిరక్షణ చర్యలను వివరించారు. భారతదేశంలో 1318 జాతుల సీతాకోకచిలుకలు ఉన్నాయని తెలిపారు. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ అనంత్ శంకర్ ఈ సదస్సుకు సారథ్యం వహించారు. అయన మాట్లాడుతూ తూర్పు కనుమల్లో ఉన్న జీవ జంతు జాలం పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అరవై రకాల సీతాకోకచిలుకల్ని, 30 కి పైగా జాతుల మాత్ లను ఈ రెండురోజుల ఫీల్డ్ విజిట్ లో గుర్తించామని తెలిపారు. హిమాలయాల్లో సంచరించి ఒక జాతి మాత్ ఉనికిని ఏ పరిశీలనలో గుర్తించడం జరిగిందని కూడా అయన చెప్పారు. ఈ మాత్ ఇక్కడ కనిపించడమిదే తొలిసారి అన్నారు. కాగా కోరింగలోని బయో డైవర్సిటీ సెంటర్ లో శనివారం జరిగిన వర్క్ షాప్ ముగింపు సభలో ఇగ్రీ ఫౌండేషన్ సి ఈ ఓ శ్రీ జె ఎస్ ఎన్ మూర్తి , డి ఎఫ్ ఓ లు అనంత్ శంకర్, నందని సలారియా తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు