ఈవీఎం లపై సందేహాలకు శాశ్వత సమాధానం?


వీవీ ఫ్యాట్లు అన్నీ లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుంది అని ఈసీ సుప్రీం కోర్టుకి చెప్పింది. కేవలం ఈ వ్యవధిని దృష్టిలో ఉంచుకునే సుప్రీం కోర్టు వీవీ ఫ్యాట్స్ లెక్కింపులో వివిధ రాజకీయ పక్షాల డిమాండ్ ని తిరస్కరించింది. గతంలో బ్యాలట్ తో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలోపు ఫలితాలు వచ్చేవి.. ఇప్పుడు వీవీ ఫ్యాట్లు లెక్కిస్తే ఆర్రోజులు ఎందుకు పడుతుంది? సో ఇది పక్కా అబద్ధం. సరైన ప్లానింగ్, చేసి తీరాలన్నఆదేశాలు ఉంటే నిజానికి ఒక 15 గంటలు లేదా ఒక రోజు ఈ టోటల్ కౌంటింగ్ కి పట్టొచ్చు.. అంటే అన్ని వీవీ ఫ్యాట్లు, ఈవీఎమ్ లు లెక్కించడానికన్నమాట. అది కాదు రెండు మూడు రోజులు పట్టింది అనుకుందాం... ఏడు విడతలుగా ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా రెండు నెలల పైచిలుకు సమయాన్ని కోడ్ కి కేటాయించి... ఎన్నికల ప్రక్రియ కోసం నానా కంగాళీ చేసిన ఈసీ కేవలం ఈ ఐదారు రోజుల సమయాన్ని మాత్రమే కుదించడానికి ఇంత పట్టు పట్టడం ఎందుకు? ఈవీఎం లపై సందేహాలు ఈనాటివి కావు. వాటి వినియోగం మొదలైన నాటినుంచి భాజపా అగ్రనేత అద్వానీ మొదలు ఇవాళ చంద్రబాబు నాయుడు వరకూ దాదాపు ప్రతిపార్టీ నాయకుడూ అనుమానాలు వ్యక్తం చేసినవాళ్ళే. అయితే ఇక్కడో గమనార్హమైన అంశం ఉంది. వాళ్ళు తప్పు చెబుతున్నారా... రైటు చెబుతున్నారా అనే విషయం పక్కన పెడితే దేశంలో 23 గుర్తింపు పొందిన పార్టీలు, పార్లమెంటులో ఉనికి ఉన్న రాజకీయ పార్టీలు ఈవీఎం లపై సందేహాలు లేవనెత్తాయి. ఊరికే విమర్శలు చేసి ఊరుకోవడం కాకుండా సవివర నిర్మాణాత్మక ఒక నివేదిక ఇచ్చాయి.. ఆ మేరకి సుప్రీం కోర్టుకి కూడా వెళ్లాయి. ఇక్కడ కోర్టు కానీ.. ఈసీ కానీ దీనిని ప్రజాస్వామ్యానికి మంచి చేసే ఒక అవకాశంగా తీసుకొని ఉండాల్సింది. ఎలాగూ ముక్తకంఠంతో డిమాండ్ వచ్చింది కనుక మొత్తం వీవీ ఫ్యాట్లు, ఈవీఎం లు లెక్కించడానికి ఆదేశాలు ఇచ్చేసి ఉంటే చక్కగా ఉండేది. ఈసీ ఈమేరకు నిర్ణయిస్తే భాజపా అనుకూల పక్షాలు కూడా ఒప్పుకునేవి. ఎవరినుంచీ వ్యతిరేకతా రాదు... అంతే కాకుండా ఇక భవిష్యత్తులో ఈవీఎం లపై సందేహాలైనా సమసిపోయేవి.. లేదా ఈవీఎం లతో ఎన్నికల వలన లెక్కల్లో లోపాలు ఉంటే.. ఉండే అవకాశం ఉంటే ఏదైనా బయటపడేది. ఈ ఎన్నికలు నూరుశాతం కరెక్టుగా జరిగాయి అనడానికి, ఈవీఎం లతో ప్రజాస్వామ్యానికి ఏ ముప్పూ లేదు అనడానికి గీటురాయిగా 2019 ఎన్నికలు నిలిచే గొప్ప సువర్ణావకాశాన్ని ఈసీ, దేశ పాలకపక్షం, సుప్రీం కోర్టు సంయుక్తంగా పాడు చేశాయని నా భావన. ఈవీఎం లు ట్యాపరింగ్ జరిగితే తప్ప.. వీవీ ఫ్యాట్లు, ఈవీఎం లెక్కింపు మధ్య పెద్దగా అంతరం ఉండే అవకాశం లేదు. అంచేత అన్నీ లెక్కించినా కూడా విజేతల్లో పెద్ద తేడా రాదు. వీవీ ఫ్యాట్లు ఉన్నాయి కాబట్టి ఈవీఎం తో సరిపోల్చి చూపిస్తే నమ్మక తప్పని పరిస్థితి ఉంది. అదే వీవీ ఫ్యాట్లు లేకపోతే గందరగోళం అలాగే ఉంటుంది కదా. ఐదేసి వీవీ ఫ్యాట్లు అన్నారు.. వాటి లెక్కకి, ఈవీఎం లెక్కకి ఒకటో అరో తేడా వస్తే! మళ్ళీ కొత్త అనుమానాలేగా. అంచేత ఈసారి కాకున్నా.. ఇంకోసారైనా .. ఒక్కసారైనా ఈవీఎం లు, వీవీ ఫ్యాట్లు కలిపి సమగ్రంగా లెక్కించడం, అన్ని పార్టీల అన్ని అనుమానాలకు చెక్ చెప్పడం ఈసీ విధి.

ముఖ్యాంశాలు