ఐపీఎస్ ఇల్లే డ్రగ్స్ స్థావరం... తెలియదంటున్న అధికారి


యూపీలోని నోయిడా దగ్గర ఇంతవరకూ దేశంలో ఎన్నడూ పట్టుబడనంత పెద్ద స్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకొన్నారు. ఈ దాడిలో 1,818 కిలోల మాదక ద్రవ్యాలను నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఖరీదు సుమారు రూ.వెయ్యి కోట్లని అధికారులు తెలిపారు. ఈ స్థావరాన్ని నిర్వహిస్తున్న ఇద్దరు నైజీరియా దేశస్థులను, ఒక దక్షిణాఫ్రియా జాతీయుణ్ని అరెస్టు చేశారు. ఇక్కడ విశేషం ఏమంటే ఈ ముఠా ఉన్నస్థావరం ఓ ఐపీఎస్‌ అధికారి ఇల్లని గుర్తించారు. ఎన్‌సీబీ అధికారుల కథనం ప్రకారం.. డ్రగ్స్‌ ముఠాపై చిన్న సమాచారం అందింది. దిల్లీ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించిన 31 ఏళ్ల విదేశీయురాలి ద్వారా ఈ గుట్టు బయటకు వచ్చింది. తొలుత ఈ విషయాన్ని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది గుర్తించారు. ఆ విదేశీ మహిళ బ్యాగుల్లో 24.7 కిలోల మాదక ద్రవ్యాలను భద్రతా సిబ్బంది పట్టుకుని .. ఆరా తీయగా ఇద్దరు నైజీరియా దేశస్థుల పేర్లను ఆమె వెల్లడించింది. మహిళ ఇచ్చిన ఆధారాల ప్రకారం ఎన్‌సీబీ అధికారులు తనిఖీలు చేయగా అసలు గుట్టు బయటపడింది. తాము అక్రమంగా సేకరించిన రసాయన పదార్థాల తో మాదక ద్రవ్యాలను తయారు చేస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. ఈ డ్రగ్స్‌ను వారు దిల్లీతోపాటు విదేశాలకు స్మగుల్ చేస్తున్నారు. మాదక ద్రవ్యాల తయారీ స్థావరం ఒక ఇంట్లో ఉంది. ఈ ఇల్లు ఎవరిదంటే యూపీ పోలీస్‌ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో అధికారిట. అతడ్ని ప్రశ్నించగా మీడియేటర్ ద్వారా ఇల్లు అద్దెకిచ్చానని అక్కడ ఏం జరుగుతుందో తనకేమీ తెలియదని బుకాయించాడని సమాచారం.

ముఖ్యాంశాలు