గూడెంలో తెదేపా నేతల తీరుపై బాబు సీరియస్


పశ్చిమ గోదావరి జిల్లాలో తెదేపానేతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో తెదేపా-బీజేపీ నేతల మధ్య తలెత్తిన వివాదం, ఆ సందర్భంగా జడ్పీ చైర్మన్ బాపిరాజు, ఇతర తెదేపా నేతల వ్యాఖ్యల విషయం తెలుసుకున్న చంద్రబాబు సీరియస్ అయ్యారు. శనివారం పార్టీ ముఖ్యనేతలతో తన నివాసంలో సమావేశమైన చంద్రబాబు దృష్టికి పార్టీ నేతలు కొందరు ఈ విషయాన్ని తీసుకెళ్లగా... దీనిపై విచారణకు మంత్రలు పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, పిఠాపురం ఎమ్మెల్యే వర్మతో సీఎం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాపిరాజు వ్యవహారశైలి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఇప్పటికే బాపిరాజు అనేకసార్లు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించారన్నారు. ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి త్వరగా నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కమిటీని ఆదేశించారు. తాడేపల్లి గూడెంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (బిజెపి నేత) ను టార్గెట్ చేస్తూ బాపిరాజు వర్గం మొదటినుంచీ వివాదాలు సృష్టిస్తున్నదనే విషయాన్ని తెదేపా నేతలే చంద్రబాబుకి వివరించడం విశేషం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం