అగ్ని -5 పరీక్షకు సన్నాహాలు


అణు క్షిపణి అగ్ని-5ను పరీక్షించేందుకు భారత్‌ సన్నాహాలు మొదలెట్టింది. బహుశా ఈ నెల 18, 19 తేదీల్లో ఒక రోజు అగ్ని-5 క్షిపణి పరీక్ష జరగొచ్చని భావిస్తున్నారు. భారత సైన్యానికి చెందిన స్ట్రాటజిక్ గ్రూప్స్ కమాండ్‌ ఈ పరీక్షలను నిర్వహించనుంది. క్షిపణి పనితీరును ట్రాక్‌ చేయడానికి అవసరమైన పరికరాలను ఇప్పటికే సిద్ధం చేసారు. సంక్షోభం తలెత్తినప్పుడు ఎంత తక్కువ టైం లో ఈ క్షిపణిని ప్రయోగించగలరనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ తాజా పరీక్ష చేపట్టారు. 17 మీటర్ల పొడవు.. రెండు మీటర్ల చుట్టుకొలత, 50 టన్నుల బరువు ఉండే అగ్ని -5 క్షిపణి 1.5 టన్నుల వార్‌ హెడ్‌ను మోసుకెళ్లగలదు. ఈ క్షిపణి ప్రయాణం మొదలెడితే శత్రు దేశాల రాడార్లకు సైతం అందదు. ఏకకాలంలో పలు లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యం దీని సొంతం. ఈ క్షిపణికి దాదాపు 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. ఈ దృష్ట్యా పరీక్ష సమయంలో ఇండోనేషియా, ఆస్ట్రేలియాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం