సుప్రీం వివాదంలో ఆసక్తికర మలుపులు


సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై నలుగురు సీనియర్ న్యాయమూర్తుల తిరుగుబాటు వ్యవహారం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. సీజే పై బహిరంగ ఆరోపణలు చేసిన నలుగురు జడ్జీలకు కాసేపటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత కాసేపటికి కమ్యూనిస్ట్ నేత డి రాజా తిరుగుబాటు న్యాయమూర్తుల్లో ఒకరైన జాస్తి చలమేశ్వర్ ని కలిసి మాట్లాడారు. కాగా సుప్రీం కోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు వికాస్ సింగ్ మాత్రం ఈ నలుగురు న్యాయమూర్తుల తీరును తప్పుపట్టారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అభిశంసనకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు! అసలా నలుగురూ మీడియా సమావేశం పెట్టి కొత్తగా వెల్లడించిన అంత గొప్ప విషయం ఏమి ఉందని ఆయన ప్రశ్నించారు. దీపక్ మిశ్రా ఆదర్శవంతంగా వ్యవహరిస్తున్నారన్నారు. బెంచ్ ల ఏర్పాటును ఎలా తప్పుపడతారని ప్రశ్నించారు. ఇకపోతే లేఖలో న్యాయమూర్తులు ప్రస్తావించిన మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ ని ప్రధాన న్యాయమూర్తి గతంలోనే ఉపసంహరించుకున్నారని వికాస్ సింగ్ తెలిపారు.

ముఖ్యాంశాలు